twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్లాసిక్స్ చెడగొడుతున్నారు: గాన కోకిల లతా మంగేష్కర్ అసంతృప్తి

    రీమిక్స్ చేయ‌డం ఒరిజిన‌ల్ పాట‌ను అగౌర‌వ‌ప‌రిచిన‌ట్లేన‌ని అతా మంగేష్కర్ అన్నారు. పాత క్లాసిక్స్‌ను రీమిక్స్ చేయ‌డం అంటే... తాజ్ మ‌హ‌ల్‌కి కొత్త గ‌దులు చేర్చ‌డం లాంటిదే అన్నారు.

    By Bojja Kumar
    |

    యష్ రాజ్ ఫిల్మ్స్ తాజాగా తన యూట్యూబ్ ఛానల్‌లో 'మే యార్ మనా నీ' అనే రీమిక్స్ సాంగ్‌ను రిలీజ్ చేసింది. ఒరిజినల్‌గా ఈ పాట 1973లో విడుదలైన 'డాగ్' అనే సినిమాలోనిది. అప్పట్లో ఈ పాటను గాన కోకిల్ లతా మంగేష్కర్ పాడారు. ల‌క్ష్మీకాంత్ ప్యారేలాల్‌ సంగీతం అందించారు.

    ఇపుడు ఈ పాటను హితేష్ మోదక్ రీమిక్స్ చేయగా, యషితాశర్మ పాడారు. ఈ పాటకు వాణి కపూర్ మోడ్రన్ డాన్స్ స్టెప్స్ జోడించి ఈ పాటను విడుదల చేశారు. అయితే ఈ పాటను రీమిక్స్ చేయడంపై లతా మంగేష్కర్ స్పందన కోరగా ఆమె... ఈ రీ మిక్స్ వ్యవహారాన్ని తప్పుబట్టారు.

    అగౌరవ పరచడమే, నేను వినను

    అగౌరవ పరచడమే, నేను వినను

    రీమిక్స్ చేయ‌డం ఒరిజిన‌ల్ పాట‌ను అగౌర‌వ‌ప‌రిచిన‌ట్లేన‌ని ఆమె అన్నారు. అందుకే రీమిక్స్ పాట‌ల‌ను తాను విన‌బోన‌ని చెప్పారు. `నేను ఈ రీమిక్స్ పాట విన‌లేదు. విన‌బోను కూడా... అని ఆమె సమాధానం ఇచ్చారు.

    నేను కామెంట్ చేయదలుచుకోలేదు

    నేను కామెంట్ చేయదలుచుకోలేదు

    తన పాటను రీమిక్స్ చేయడం మీద తాను ఎలాంటి కామెంట్ చేయదలుచుకోలేదని.... లతా మంగేష్కర్ తన పరోక్షంగా తన అసంతృప్తిని వెల్లగక్కారు.

    చెడగొడుతున్నారు

    చెడగొడుతున్నారు

    నేను మొద‌ట్నుంచి రీమిక్స్ పాట‌ల‌ను వ్య‌తిరేకిస్తూనే ఉన్నాను. క్లాసిక్ పాట‌ల‌ను మళ్లీ రీమిక్స్ చేయవద్దు. అలా చేస్తే వాటిని అగౌరవ పరచడమే. ఇప్ప‌టికే ల‌క్ష్మీకాంత్ ప్యారేలాల్‌, మ‌ద‌న్ వంటి దిగ్గ‌జాల పాట‌ల‌కు బీట్స్‌, లిరిక్స్ జోడించి చెడగొట్టారు అని ఆమె అన్నారు.

    తాజ్ మహల్‌కు కొత్తగా గదులు కట్టడమే

    తాజ్ మహల్‌కు కొత్తగా గదులు కట్టడమే

    పాత క్లాసిక్స్‌ను రీమిక్స్ చేయ‌డం అంటే... తాజ్ మ‌హ‌ల్‌కి కొత్త గ‌దులు చేర్చ‌డం లాంటిదే. ఒరిజిన‌ల్ పాట‌ను క్రియేట్ చేయ‌లేన‌పుడు మ‌రొక‌రి పాట‌ను రీమిక్స్ చేయ‌డం స‌బ‌బు కాదు` అని ల‌త అన్నారు.

    రీమిక్స్ చేసిన పాట ఇదే

    యష్ రాజ్ ఫిల్మ్స్ తాజాగా తన యూట్యూబ్ ఛానల్‌లో రిలీజ్ చేసిన ‘మే యార్ మనా నీ' అనే రీమిక్స్ సాంగ్‌ ఇదే.

    ఒరిజినల్ సాంగ్

    ‘మే యార్ మనా నీ' ఒరిజినల్ సాంగ్ వీడియో

    English summary
    When asked if she has heard the new version of Main Yaar Manana Ni, Lata Mangeshkar blatantly denied and said neither does she want to listen to it. “I haven’t heard this new version. Nor would I want to hear it. So, I wouldn’t want to comment on it. But in principle, I’ve always been opposed to remixes and cover versions of classics. They shouldn’t be touched. So many of Pancham’s, Madan Mohan’s and Laxmikant-Pyarelal’s songs have been tampered with; beats and lyrics are modified. It’s like rooms being added or removed from the Taj Mahal. These composers knew what they were doing. I don’t think their efforts need any boosting," she was quoted as saying by DNA.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X