ధోనీ.. అలాంటి ఆ ఆలోచన మానుకో.. మనసులో పెట్టుకోవద్దు.. సింగర్ లతా మంగేష్కర్ రిక్వెస్ట్
Recommended Video
మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్ అంతా సాఫీగా సాగుతోంది. భారత క్రికెట్‌లో
ఆయనో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడని చెప్పుకోవచ్చు. టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించిన ఘనత ధోనీదే. అయితే ధోనీ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై ఒక్కొక్కరి స్పందన ఒక్కోలా ఉంది. తాజాగా ధోని రిటైర్మెంట్ అంశంపై సింగర్ లతా మంగేష్కర్ స్పందిస్తూ సోషల్ మీడియాలో సందేశం పోస్ట్ చేసింది. ఆ వివరాలు చూస్తే..

ప్రపంచకప్ ముగియగానే ధోనీ రిటైర్మెంట్
2019 ప్రపంచకప్ ముగిసిన వెంటనే భారత జట్టు ఆటగాడు ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ ఊహించారు. ఈ మేరకు ఈ ప్రపంచకప్ గెలిచి ధోనీ ఘనంగా వీడ్కోలు తీసుకోవాలని అభిమానులు ఆశించారు. కానీ ఊహించని రీతిలో సెమీస్‌లోనే భారత్ ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. రిటైర్మెంట్ ప్రకటించడం లాంఛనమే అయినా.. ధోనీ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం విశేషం.

సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ధోనీ అవుట్
ప్రపంచ కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇండియా ఓటమి, చివరి దాకా పోరాడి 49వ ఓవర్లో ధోనీ ఊహించని విధంగా రనౌట్ కావడం క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. రిటైర్మెంట్ ప్రకటిస్తా అన్నాడు కాబట్టి ధోనీకి ఇదే ఆఖరి మ్యాచ్ అవుతుంది. అలాంటి ఈ మ్యాచ్‌లో ధోనీ ఇలా ఔట్ కావడం చాలా బాధాకరం అని తెగ ఫీలై పోతున్నారు క్రీడాభిమానులు.
ధోనీ కెరీర్ కొనసాగితే బెటర్
ధోనీ కెరీర్ ఇంకొంతకాలం కొనసాగితే బెటర్ అని ఇప్పటికే చాలామంది మాజీ క్రికెటర్లు, సెలబ్రిటీలు తమ అభిప్రాయలు వ్యక్తం చేశారు. ఈ కోవలోనే తాజాగా ధోనీ రిటైర్మెంట్ వార్తలపై సింగర్ లతా మంగేష్కర్ కూడా స్పందిస్తూ.. ఆయన ఇప్పుడే రిటైర్మెంట్ తీసుకోవద్దని సూచించింది. ఈ మేరకు ధోనీని రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ చేసింది లతా మంగేష్కర్.

ధోనీ ఆ ఆలోచన మానుకో..
నమస్కార్ ధోనీజీ... మీరు క్రికెట్‌కి గుడ్ బై చెబుతున్నట్లుగా వార్తలు వింటున్నా. దయచేసి అలాంటి ఆలోచనలు మీ మనసులోంచి తీసేయండి. మీ ఆట ఇంకా దేశానికి చాలా అవసరం. ఇప్పుడే రిటైర్మెంట్ తీసుకోవద్దని నా వ్యక్తిగత అభిప్రాయం అని లతా మంగేష్కర్ తన ట్వీట్ లో పేర్కొంది. కాగా ధోనీ రిటైర్మెంట్‌పై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.


Click it and Unblock the Notifications











