నా వయసు పద్దెనిమిది మాత్రమే అనుకుంటున్నా
'నాకు 81 ఏళ్లు నిండాయి. ఇప్పటికీ నాకు 18 ఏళ్లు లాగే అనిపిస్తోంది' అని ప్రముఖ నేపథ్య గాయని లతామంగేష్కర్ పేర్కొన్నారు.ఆమెకు ఫ్రాన్స్ దేశపు అత్యున్నత పురస్కారం లభించింది. ఫ్రాన్స్ ఫ్రభుత్వం ఆమెను 'ఆఫీసర్ డి లా లీజియన్ డి ఆనర్' అవార్డుకు ఎంపిక చేసింది. ఫ్రాన్స్ ప్రభుత్వం ముంబైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ అత్యున్నత పురస్కారాన్ని అందజేసిన ఫ్రాన్స్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఫ్రాన్స్ పౌరులతో పాటు విదేశీయులకు కూడా ఈ అవార్డు ఫ్రెంచ్ రిపబ్లిక్ అందజేస్తుంది. ధైర్యసాహసాలతో పాటు అందానికి కూడా ఫ్రాన్స్ పుట్టినిల్లని లతా అన్నారు. సుగంధలేపనాలు, వైన్, షాంపెయిన్‌లకు ప్రపంచవ్యాప్తంగా పెట్టిందిపేరని కొనియాడారు. ఫ్రాన్స్‌కు తాను గొప్ప అభిమానినని అన్నారు.లతా మంగేష్కర్ కు ఇప్పటికే రకరకాల అవార్డులు వరించాయి. ఈ అవార్డు మరో అలంకారం మాత్రమేనని..ఆమె గాత్రానికి ఇప్పటికీ చెవులు కోసుకుంటామని చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు ఈ సందర్భంగా ఆమెను ప్రశంసించారు.


Click it and Unblock the Notifications











