twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వేలానికి దివంగత నటి ఇల్లు: రంగంలోకి ఐటీ శాఖ..

    |

    చెన్నైలోని దివంగత నటి శ్రీవిద్య ఇంటిని ఆదాయపన్ను శాఖ అధికారులు వేలం వేయనున్నారు. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న బకాయిలను క్లియర్ చేయడానికే ఈ వేలం నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు.

    మార్చి 26వ తేదీన రూ.1.14కోట్ల ప్రారంభ ధరతో ఆ ఇంటిని వేలం వేయనున్నట్టు అధికారులు తెలిపారు. చెన్నైలోని అభిరామపురంలో ఉన్న ఈ ఇల్లు ప్రస్తుతం ఐటీ(ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్) ఆధీనంలోనే ఉంది. ఉమాశంకర్ అనే న్యాయవాదికి దీన్ని అద్దెకు ఇచ్చినట్టు సమాచారం. ఆ అద్దెను ఐటీ జమ చేసుకుంటోంది.

    Late actress Srividya’s flat in Chennai put up for auction...

    వేలంపై స్పందించిన ఉమాశంకర్.. 2005లో శ్రీవిద్య ఈ ఇంటిని తనకు అద్దెకు ఇచ్చినట్టు తెలిపారు. ప్రతీ నెల తాను ఇచ్చే రూ.13వేల అద్దెను శ్రీవిద్యకు సన్నిహితుడైన ఎమ్మెల్యే గణేశ్ కుమార్ ఐటీ శాఖకు చెల్లిస్తున్నట్టు చెప్పారు.

    కాగా, శ్రీవిద్య 2006లో కేరళలో క్యాన్సర్ వ్యాధితో మరణించారు. 1996 నుంచి ఆమె చనిపోయేనాటి వరకు ఆమె ట్యాక్స్ చెల్లించలేదు. దీంతో పెండింగ్ బకాయిల మొత్తం భారీగా పెరిగిపోయింది. ఇన్నాళ్లు ఇంటి అద్దెనే బకాయి కింద వసూలు చేసుకుంటున్నప్పటికీ.. ఇలా అయితే కష్టమని భావించిన ఐటీ.. ఇప్పుడు ఏకంగా ఇంటినే వేలానికి పెట్టింది.

    English summary
    The Income Tax department has put up for auction, deceased South Indian actress Srividya’s flat in C...
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X