Related Articles
హాస్యరసం పాదర సంలాంటిది కామెడీ 'పులిహోర'
రంగస్థలంలో మళ్ళీ సందడి.. మొదలు పెట్టిన మెగాస్టార్!
రంగస్థలం తరువాత సైరానే.. అక్కడే భారీగా!
బన్నీని సర్ప్రైజ్ చేసిన మెగాస్టార్.. అందరికి ఆశ్చర్యం!
కాస్టింగ్ కౌచ్ ఇష్యూలో మహేష్ కత్తిపై ఆరోపణలు, కేసు వేస్తా...కొణిదెల ఫ్యామిలీ పనే అన్న కత్తి!
అప్పుడు రజనీకాంత్ అడ్డుకొన్నాడు.. ఇప్పుడు చిరంజీవి.. రత్నవేలు
మాది భార్యభర్తల బంధం.. అందుకే రంగస్థలం బ్లాక్‌బస్టర్.. అప్పుడే వండర్ అనిపించింది.. రత్నవేలు
సైరాలో మిల్కీ బ్యూటీ.. ముఖ్యమైన పాత్రలో!
ఘరానా మొగుడిగా చిరంజీవికి 26 ఏళ్లు.. రికార్డులు లెఫ్ట్ టర్నింగ్..
చిరంజీవి చెబితే జనసేనకు సపోర్ట్ చేస్తా.. పవన్, చిరు ఫాన్స్‌కు కూడా గొడవలు వచ్చాయి: బన్నీ
నిహారిక, ప్రభాస్ మ్యారేజ్ రూమర్.. అసలు నిజం వెల్లడించిన మెగాస్టార్ చిరంజీవి!
రావు రమేష్‌కు చిరంజీవి ఓదార్పు.. కుటుంబానికి మెగాస్టార్ పరామర్శ
సుకుమార్ వివాదంపై జబర్దస్త్ మహేష్ స్పందన.. ఆయన నన్ను కొట్టలేదు!
ఇటీవల మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్‌షోలో ప్రముఖ దర్శకుడు జంధ్యాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మెగాస్టార్ చిరంజీవి, హాస్యనటుడు బ్రహ్మానందంకు చేదు అనుభవం ఎదురైనట్టు తెలుస్తున్నది. మద్యానికి బానిస కావడంతోనే జంధ్యాల చిన్న వయస్సులో మరణించారని వారు చేసిన వ్యాఖ్యలపై జంధ్యాల సతీమణి రాణి మండిపడినట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నది.

తెలుగు సినీ పరిశ్రమలో బ్రహ్మానందానికి జీవితాన్ని ఇచ్చిన జంధ్యాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ఆగ్రహానికి గురైన రాణి.. మెగాస్టార్ చిరంజీవి, బ్రహ్మీని ఫోన్ చేసి క్లాస్ పీకినట్టు సమాచారం. అంతర్గతంగా జరిగిన సంభాషణ ఎలా బయటకు పొక్కిందనే విషయం చర్చనీయాంశంగా మారింది.
బ్రహ్మానందానికి జంధ్యాల ఎంకరేజ్‌మెంట్
ఏప్రిల్ 2 (ఆదివారం) తేదీన మీలో ఎవరు కోటీశ్వరుడు (ఎంఈకే) ప్రొగ్రాంకు బ్రహ్మానందం సెలబ్రీటిగా హాజరయ్యారు. బ్రహ్మానందానికి సినీ పరిశ్రమలో జన్మనిచ్చిన జంధ్యాల ఆయనను ప్రేమగా బ్రహ్మీ అని పిలుచుకొంటారు. అహా నా పెళ్లంట చిత్రంలో బ్రహ్మీకి మంచి పాత్రను ఇచ్చి ప్రోత్సహించారు జంధ్యాల. ఆ పాత్ర తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా టాలీవుడ్‌లో బ్రహ్మీ పాగా వేయడానికి కారణమైంది ఆ చిత్రం.
జంధ్యాలపై అనుచిత వ్యాఖ్యలు
ఎంఈకే ప్రోగ్రాం చాలా ఆసక్తిగా సాగింది. బ్రహ్మానందం తనదైన శైలిలో కార్యక్రమంలో హాస్యాన్ని పండిస్తూ గేమ్ షోను ఆసక్తిగా మలిచారు. ఈ సందర్భంగా బ్రహ్మీ జీవిత విశేషాల గురించి చిరంజీవి మరోసారి అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా తనకు జన్మనిచ్చిన జంధ్యాల గురించి ప్రస్తావన వచ్చింది. ఆ క్రమంలో విపరీతంగా తాగుడుకు అలవాటు పడటం వల్లనే జంధ్యాల మరణించాడని బ్రహ్మీ చెప్పుకొచ్చారు.
అనవసరపు ప్రస్తావనతో..
జంధ్యాల మద్యం అలవాట్ల గురించి దాదాపు చిరంజీవి, బ్రహ్మానందం మధ్య సుమారు ఐదు నిమిషాలపాటు చర్చ జరిగింది. అయితే ఆ కార్యక్రమంలో జంధ్యాల గురించి అలాంటి ప్రస్తావన అవసరం లేదనేది పలువురి వాదన. సాధారణంగా చనిపోయిన వ్యక్తి గురించి లేదా ప్రముఖుల వ్యక్తిగత విషయాల గురించి బహిరంగ చర్చలో మాట్లాడటం పద్ధతి కాదు అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
రాజబాబు మాదిరిగానే తాగుడుకు బానిసై..
దర్శకుడి గొప్పతనం చెబుతూనే ప్రముఖ హాస్యనటుడు రాజబాబు మాదిరిగానే తాగుడుకు బానిసై చనిపోయారని బ్రహ్మీ చెప్పడంపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని చూసిన జంధ్యాల భార్య, ఆయన ఇద్దరు కూతుర్లు బ్రహీ వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోయారనేది తెలిసింది.
బ్రహ్మీకి ఫోన్ చేసి లైఫ్ట్ అండ్ రైట్
తన భార్త గురించి చెడుగా మాట్లాడిన బ్రహ్మానందానికి జంధ్యాల భార్య టెలిఫోన్ చేసి చెడామడా క్లాస్ పీకిందట. జంధ్యాల గురించి తప్పుడుగా మాట్లాడి ఆయనను అవమానించారని బ్రహ్మీని లెఫ్ట్ అండ్ రైట్ తీసుకొన్నారట. మోతుబరి పోకడలను మానుకోవాలని హెచ్చరించారట. ఎదిగిన కొద్ది ఒదిగిపోవాలన్న రీతిలో ఉండాలని గతంలో జంధ్యాల చెప్పిన మాటలను రాణి గుర్తి చేసినట్టు సమాచారం. ఇక నుంచైనా మరొకరి గురించి చెడుగా మాట్లాడవద్దని సూచించినట్టు తెలుస్తున్నది.
చిరంజీవికి కూడా క్లాస్
అలాగే ఈ విషయంపై తన నిరసనను వ్యక్తం చేయడం కోసం రాణి చిరంజీవికి కూడా కాల్ చేసినట్టు సమాచారం. తన భర్త తాగుడు అలవాట్ల గురించి మాట్లాడటం మీలాంటి వారికి భావ్యం కాదని సున్నితంగా మందలించినట్టు తెలిసింది. తన భర్తకు సంబంధించిన మెడికల్ రిపోర్టు తన వద్ద ఇంకా ఉన్నాయని, ఆయన డయాబెటిస్ తో మరణించారని, లివర్ ప్రాబ్లంతో కాదు అని స్పష్టం చేశారనే రాణి టెలిఫోన్ సంభాషణ సారాంశమట.
చిరు, బ్రహ్మీ క్షమాపణ!
ఈ విషయంపై రాణికి చిరంజీవి, బ్రహ్మానందం క్షమాపణ చెప్పినట్టు తెలిసింది. అంతేకాకుండా జంధ్యాల అంటే తనకు ఎనలేని గౌరవం అని రాణికి మెగాస్టార్ చెప్పారనే విషయం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
లీగల్ నోటీసులు
చిరంజీవి, బ్రహ్మానందం వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన రాణి ఓ దశలో చట్టపరంగా నోటీసులు పంపించాలని భావించారట. వారిద్దరు కూడా క్షమాపణలు చెప్పిన తర్వాత పరువు నష్టం వేసేంత వరకు వెళ్లొద్దని ఆమెకు స్నేహితులు, సన్నిహితులు సూచించడంతో కొంత చల్లబడ్డట్టు తెలుస్తున్నది.
బహిరంగ క్షమాపణలు చెప్పాలి..
జంధ్యాల ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా తాము చేసిన వ్యాఖ్యలకు టెలివిజన్ ద్వారా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తున్నది. అయితే ఇద్దరు ప్రముఖులతో జంధ్యాల భార్య రాణి టెలిఫోన్‌లో జరిగిన సంభాషణ మీడియాకు ఎలా లీక్ అయిందనే ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి | Subscribe to Telugu Filmibeat.