శభాష్ సమంత...అంటున్నారంతా
హైదరాబాద్ : ఇప్పటికే ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక సేవలు చేస్తున్న సమంత ఇప్పుడు ‘ఫుడ్ ఫర్ చేంజ్' అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ ( ప్రచారకర్తగా) వ్యవహరించనుంది. ఈ కొత్త ఆర్గనైజేషన్ ద్వారా పేదవారికి చదువు చెప్పించి వారి భవిష్యత్తుని తీర్చిదిద్దే అవకాశం వచ్చిందని ఆమె చాలా సంతోషంగా చెప్తోంది. సమంత చేస్తున్న ఈ సామాజిక కార్యక్రమాలు ను చూసి అందరూ ఆమెపై ప్రశంసల జల్లుల కురిపిస్తున్నారు.
ఇప్పటికే ఆమె ప్రాజెక్ట్ 511 పేరిట నడుస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ తో కలిసి పనిచేస్తోంది. ప్రాజెక్ట్ 511 హైదరాబాద్ పరిసర ప్రాంతాలలోని 511 ప్రభుత్వ స్కూళ్లను గుర్తించి వాటికి మౌలిక సదుపాయాలను తన వంతుసాయంగా అందజే స్తోంది. ఇటువంటి పాఠశాలల్లో ఎక్కువగా చదువు కునేది పేద విద్యార్థులే.

ఇక సమంత కెరీర్ విషయానికి వస్తే... ఆమె తెలుగు,తమిళ భాషల్లో బిజీగా ఉంది. అయితే బాలీవుడ్ కి వెళ్లాలని ఆమె అబిమానులు కోరుకుంటున్నారు.
దక్షిణాదిన కొన్ని విజయాలు చేతికి అందగానే ఇక అందరి దృష్టి బాలీవుడ్‌పై పడుతుంది. అక్కడ కూడా నిరూపించుకోవాలన్న తపన మొదలవుతుంది. అయితే సమంతకు అలాంటి ఆలోచనలేం లేదని స్పష్టం చేస్తోంది.
ఈ విషయమై ఆమె మాట్లాడుతూ...''నా దగ్గర కూడా కోరికల జాబితా చాలానే ఉంది. మంచి సినిమాలు చేయాలి, మరింత పేరు తెచ్చుకోవాలని ఉంది. అయితే ఈ జాబితాలో హిందీ సినిమా చేయాలన్న కోరిక లేదు..'' అంటోంది సమంత.
అయినా ''హిందీలో నటిస్తేనే హీరోయిన్ గా గుర్తింపు వస్తుందా? దక్షిణాదిన చేతినిండా సినిమాలున్నాయి. నా సత్తా బయటపడిందిక్కడే. నాకంటూ ఓ అభిమాన వర్గం ఉంది. నా కోసం పాత్రలు సిద్ధం చేస్తున్న దర్శకులున్నారు. ఇవన్నీ వదులుకొని, మరో చోట అడుగుపెట్టి నా ఉనికిని చాటుకోవాలా? అంత అవసరం లేదనిపిస్తోంది. అందుకే బాలీవుడ్‌కి వెళ్లాలన్న ప్రయత్నాలేం చేయలేదు. చూద్దాం.. అలాంటి అవకాశం వస్తే, చేయాలనిపిస్తే.. అప్పుడు ఆలోచిస్తా'' అని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











