»   » గుళ్ళోకెళ్తూ ఇంత సెక్సీ డ్రెస్సా..? బుద్దుందా..?? : కొత్త వివాదం లో చార్మీ

గుళ్ళోకెళ్తూ ఇంత సెక్సీ డ్రెస్సా..? బుద్దుందా..?? : కొత్త వివాదం లో చార్మీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొన్నామధ్య ప్రధాని నరేంద్రమోడీ ముందు మోకాళ్ళు కన్పించే దుస్తులతో, అందునా కాళ్ళ మీద కాళ్ళేసుకుని కూర్చోవడమేంటి.? అన్న విమర్శల్ని ప్రియాంకా చోప్రా ఎదుర్కొన్న విషయం విదితమే. ఇప్పుడు ఛార్మిదీ అదే పరిస్థితి.పోర్చుగల్ లో గురుద్వారా ని సందర్శించిన సమయం లో తన వస్త్రధారణ సరిగా లేదంటూ సంస్కృతీ పరిరక్షకుల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి చార్మీ మీద 'గురుద్వారా సందర్శన బాగానే వుంది.. ఆ డ్రెస్సింగ్‌ ఏమాత్రం బాగాలేదు..' అంటూ వచ్చేసారు మోరల్ పోలీసులు.

పూరీ కనెక్ట్స్

పూరీ కనెక్ట్స్

టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ లేడీగా ఇమేజ్ తెచ్చుకున్న ఛార్మికి ప్రస్తుతానికి సినిమా ఆఫర్లేవీ లేవనే చెప్పాలి. దర్శకుడు పూరీ జగన్నాధ్‌తో కలిసి 'పూరీ కనెక్ట్స్' అనే పేరుతో కాస్టింగ్‌ను ఎంపిక చేసే ప్రత్యేకమైన బిజినెస్‌ను స్టార్ట్ చేసిన ఛార్మింగ్ లేడీ. ప్రస్తుతం ఆ వ్యవహారాలతో పాటు పూరీ జగన్నాధ్ సినిమాలకు సంబంధించిన అంశాలను కూడా హ్యాండిల్ చేస్తోందనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది..

బాలకృష్ణ, పూరీ మూవీ షూటింగ్

బాలకృష్ణ, పూరీ మూవీ షూటింగ్

అయితే రీసెంట్‌గా ఛార్మీ పోర్చుగల్‌లో ఉన్నానంటూ ట్వీట్ చేయడంతో... బాలయ్య సినిమాలో ఆమె నటిస్తుందేమోనన్న చర్చ మరోసారి మొదలైంది. బాలకృష్ణ, పూరీ జగన్నాధ్ కాంబినేషన్‌లోని నయా మూవీ షూటింగ్ పోర్చుగల్‌లో జరుగుతుండటంతో ఛార్మీ కూడా అక్కడికి వెళ్లిందని కొందరంటుంటే ఈ సినిమాలో ఛార్మీ ఏదో ఒక రోల్ పోషిస్తుందని, లేకపోతే ఈ సినిమా కోసం ఆమె కూడా పోర్చుగల్ వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు.

అవ‌కాశాలు లేకుండా పోయాయి

అవ‌కాశాలు లేకుండా పోయాయి

అందం, అభిన‌యం ఉన్నా పెద్ద‌గా స‌క్సెస్‌లు లేక‌నో ఎందుక‌నో వెనుక‌బ‌డిపోయిన చార్మికి ఇక ఆ త‌రువాత బొత్తిగా అవ‌కాశాలు లేకుండా పోయాయి. ఇదిలా ఉండ‌గా ఈ బొద్దుగుమ్మ‌కు బాల‌య్య స‌ర‌స‌న అవ‌కాశం వ‌చ్చిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే..

వివాదం లో తలదూర్చింది

వివాదం లో తలదూర్చింది

ఇప్పుడు ఈ సినిమాలో ఛాన్స్ ఉంటుందా లేదా అన్న సస్పెన్స్‌కు తెరపడిందట. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న ఐట‌మ్ భామ‌గా చార్మీ కనిపించనుందనే వార్తలు కూడా బలంగానే ఉన్నాయి. అయితే ఇప్పుడీ విషయాలు కాదు ఇంకో వింత పని చేసి వివాదం లో తలదూర్చింది చార్మీ...

అమ్మగారి డ్రెస్ చూస్తే అర్థమైపోతోంది

అమ్మగారి డ్రెస్ చూస్తే అర్థమైపోతోంది

అయితే పనిలో పనిగా ఛార్మీ పోర్చుగల్ లోని ఒక గురుద్వారాని సందర్శించి ఆ ఫోటోలను తన ఫేస్ బుక్ లో షేర్ చేసింది. అంతే భగ్గుమంది సోషల్ మీడియా.., అసలు నీకు బుద్ది ఉందా..? అసలేం చేస్తున్నా వో స్పృహ ఉందా?? అన్న రేంజిలో దుయ్యబట్టారు నెటిజన్లు. పంజాబీ అయిఉండి గురుద్వారా కి వెళ్తే ఇలా ఎందుకంటున్నారు అంటే ఆ సమయం లో అమ్మగారి డ్రెస్ చూస్తే అర్థమైపోతోంది.అసలు వివాదమేంటంటే, ఛార్మి డ్రెస్సింగ్‌.

మీపని మీరు చూసుకోండన్నట్టు

మీపని మీరు చూసుకోండన్నట్టు

అయితే ఎంతో పవిత్రమైన గురుద్వారా ప్రాంతంలో ఛార్మీ మోకాళ్ల వరకు మాత్రమే వేసుకున్న డ్రెస్ తో పోజులు ఇస్తూ ఫోటోలు తీయించుకున్న నేపధ్యం వివాదాలకు కారణం అవుతోంది. ఛార్మీ అభిమానులు కూడ ఇటువంటి డ్రెస్ తో గురుద్వారాలో ఛార్మీ సందడి ఏమిటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఇవన్నీ మామూలే మీపని మీరు చూసుకోండన్నట్టు లైట్ తీస్కున్నట్టుంది చార్మి...

English summary
Charmi Tollywood cutest Actress now in a contravercy, She is Trolling for her Dressing while visiting a Gurudwara in Portugal
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X