»   » ఫ్లాఫ్ టాక్- కలెక్షన్స్ టాప్, మరి మిగతావాటికి?

ఫ్లాఫ్ టాక్- కలెక్షన్స్ టాప్, మరి మిగతావాటికి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గెలుపు ఉన్న చోట ఓటమి ఉంటుంది. అలాగే హిట్స్ ఉన్న చోట ప్లాపులు ఉంటాయి. ఎంత పెద్ద హీరో అయినా ప్లాపులకు అతీతుడే ఏమీకాదు. సినీ జీవితంలో అప్పుడప్పుడు ఇలాంటివి ఎదురు కాక తప్పదు.

తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'బ్రహ్మోత్సవం' చిత్రం ప్లాపుల లిస్టులో చేరి పోయింది. మహేష్ బాబు సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంది. అయితే భారీ హిట్, లేకపోతే భారీ ప్లాప్. ఈ మధ్య కాలంలో మహేష్ బాబు సినిమాలు యావరేజ్ ఆడియన సందర్భాలు లేనే లేవు. ''బ్రహ్మోత్సవం'' సినిమా డిజాస్టర్ కా బాప్ అని తేలిపోయిందని అంటున్నారు విశ్లేషకులుక.

ఈ మధ్య కాలంలో రిలీజ్ రోజున మిక్సడ్ టాక్ వచ్చిన చాలా సినిమాలకు తరువాత కలక్షన్లు బాగానే వస్తున్నాయి. అయితే 'బ్రహ్మోత్సవం' సినిమాకు మిక్స్డ్ టాక్ కాదు పూర్తిగా నెగెటివ్ టాకే నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఈ సినిమాపై పేలుతున్న జోకులు, నెగెటివ్ ప్రచారం చూసి చాలా మంది ఈ సినిమా చూడాలనే ఆలోచనే మానేసారు.

ఎందుకు ఈ సమ్మర్ టాలీవుడ్లో టాప్ పొజిషన్లో ఉన్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబులకు కలిసి రాలేదు. పవన్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ కూడా ఇటీవల విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

స్లైడ్ షోలో ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో భారీ ప్లాపులు చవి చూసిన ఈ జనరేషణ్ స్టార్ హీరోల సినిమాల వివరాలు....

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్


పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఇటీవల విడుదలై భారీ ప్లాప్ అయింది. ప్లాపైనా ఈచిత్రం రూ. 52.92 కోట్లు వసూలు చేసింది. ఏపీ, తెలంగాణల్లో 40.94 కోట్లు వసూలు చేసింది. టాలీవుడ్ ప్లాప్ చిత్రాల్లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

మహేష్ బాబు

మహేష్ బాబు


ఇంతకు ముందు మహేష్ బాబు నటించిన ‘ఆగడు' చిత్రం భారీ ప్లాప్ అయింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ 34.05 కోట్లు వసూలు చేసింది. ఏపీ, తెలంగాణల్లో 21.75 కోట్లు వసూలు చేసింది.

రామ్ చరణ్

రామ్ చరణ్


రామ్ చరణ్ గత చిత్రం ‘బ్రూస్ లీ' చిత్రం ప్లాపైన సంగతి తెలిసిందే. ఈచిత్రం వరల్డ్ వైడ్ 40.91 కోట్లు వసూలు చేసింది. ప్లాపుల్లో సెకండ్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఏపీ, తెలంగాణల్లో రూ. 32.36 కోట్లు వసూలు చేసింది.

అల్లు అర్జున్

అల్లు అర్జున్


అల్లు అర్జున్ కెరీర్లో ప్లాప్ అంటే ‘వరుడు' చిత్రమే. ఈచిత్రం అప్పట్లో రూ. 18 కోట్ల షేర్ వసూలు చేసింది. ‘బ్రదినాథ్' చిత్రం చాలా ఏరియాల్లో నష్టాలనే మిగిలిచ్చినా సీడెడ్, కర్ణాటక లాంటి కొన్ని ఏరియాల్లో లాభాలు వచ్చాయి. ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 30 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఎన్టీఆర్

ఎన్టీఆర్


ఎన్టీఆర్ గత చిత్రం ‘రామయ్యా వస్తావయ్య' ప్లాపే. ఈ చిత్రం రూ. 30.23 కోట్లు వసూలు చేసింది. ఏపీ తెలంగాణల్లో 23.83 కోట్లు వసూలు చేసింది. మరో ప్లాప్ రభస 26.34 కోట్లు వసూలు చేయగా ఏపీ, తెలంగాణల్లో 20.84 కోట్లు వసూలు చేసింది.

ప్రభాస్

ప్రభాస్


ప్రభాస్ ప్లాపు చిత్రం ‘రెబెల్'25.40 కోట్లు వసూలు చేసింది. ఏపీ తెలంగాణల్లో 21.26 కోట్లు వసూలు చేసింది.

English summary
Power Star Pawan Kalyan's latest flop 'Sardaar Gabbar Singh' collected a share of Rs.52.92 crores and stands as the biggest grosser among the flop films of Tollywood. Mahesh's previous flop film 'Aagadu' collected Rs.34.05 crores world wide. Latest utter flop 'Brahmotsavam' is also expected to collect somewhere around Rs.35 crores in its full run world wide.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu