RRR అంటూ మోసం.. చదువుకున్న మహిళకు వల వేసి! ఆపై..

నయా జనరేషన్ లో మోసాలకు అంతు లేకుండా పోతోంది. నమ్మించి మోసం చేయడం అనే కాన్సెప్ట్ ను బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా హైదరాబాద్ లోని బోయినపల్లి ఏరియాలో ఇలాంటి సరికొత్త మోసం ఒకటి బయటపడింది. పైగా మోసగించడం కోసం RRR సినిమా పేరు చెప్పడం, అదీ చదువుకున్న మహిళను మోసం చేయడం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ మోసం ఏంటి? ఎలా జరిగింది? వివరాల్లోకిపోతే..

RRR సినిమా ఛాన్స్ అంటూ

RRR సినిమా ఛాన్స్ అంటూ

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో నటించే అవకాశం ఇస్తానని చెప్పి బురిడీ కొట్టించాడు ఓ కేటుగాడు. అది కూడా అనుభవం గడించిన ఓ మహిళా లాయర్‌ని. వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. మోసపోయానని తెలుసుకున్న ఆ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటపడింది.

RRR నిర్మాత.. ఏకంగా 50 లక్షలకు ఎసరు

RRR నిర్మాత.. ఏకంగా 50 లక్షలకు ఎసరు

వి.నరేష్ కుమార్ అనే వ్యక్తి బంజారా హిల్స్ లోని ఓ ఫేమస్ కలర్ ల్యాబ్‌లో అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. కొంతమేర సినిమా పరిచయాలు ఉండటంతో తనను తాను నిర్మాతగా పరిచయం చేసుకొని మహిళా లాయర్ వద్ద 50 లక్షలు కొట్టేశాడు. తాను RRR నిర్మాణంలో భాగం పంచుకుంటున్నాని, ఆ సినిమాలో ఛాన్స్ ఇస్తానని ఆశ చూపి 73 ఏళ్ల మహిళా లాయర్ వద్ద 50 లక్షల రూపాయలకు ఎసరు పెట్టాడు సదరు నిందితుడు.

విడాకులంటూ దగ్గరై..

విడాకులంటూ దగ్గరై..

తనకు తన భార్య నుంచి విడాకులు ఇప్పించాలంటూ మెల్లగా మహిళా లాయర్ కి దగ్గరయ్యాడు నరేష్ కుమార్. అయితే ఆ మహిళకు సినిమాల్లో నటించడంపై ఉన్న ఆసక్తిని పసిగట్టి తాను నిర్మతనని నమ్మబలికాడు. RRR లో ఛాన్స్ ఇస్తానని, అందుకోసం స్క్రీనింగ్ పరీక్షల నిమిత్తమై 50 లక్షలు అవసరమవుతాయని ఆమె వద్ద ఆ సొమ్ము లాగేశాడు.

అనుమానం వచ్చిన మహిళ పోలీసులను ఆశ్రయించడంతో

అనుమానం వచ్చిన మహిళ పోలీసులను ఆశ్రయించడంతో

50 లక్షలు తీసుకున్న నరేష్.. చాలా కాలం రేపు మాపు అంటూ కాలం గడుపుతూ వచ్చాడు. దీంతో అనుమానం వచ్చిన ఆ మహిళ RRR లో తన పాత్ర వివారాలు చెప్పాలని ఒత్తిడి తీసుకురావడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఇచ్చిన అడ్రెస్ లో కూడా ఉండటం లేదు. దీంతో ఆ లాడీ లాయర్ బోయనపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు చేసి పై వివరాలు తెలిపింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మాయగాడు వేటలో పడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X