»   » నరాలు తేగేలా కష్టపడుతున్న ఎన్టీఆర్, ఫ్యాన్స్‌లో ఉత్సాహం.... (ఫోటోస్)

నరాలు తేగేలా కష్టపడుతున్న ఎన్టీఆర్, ఫ్యాన్స్‌లో ఉత్సాహం.... (ఫోటోస్)

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Jr NTR Was Gossiped Six-Pack Abs

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పాత్ర కోసం ఎన్టీఆర్ పూర్తిగా తన బాడీ షేపులు మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. రెగ్యులర్ లుక్ నుండి కండలు తిరిగిన స్లిమ్ లుక్‌లో మారి ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతున్నాడు. లాయిడ్ స్టెవెన్స్ అనే విదేశీ కోచ్ వద్ద ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు తాజాగా ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. నరాలే తెగేలా ఎన్టీఆర్ కష్టపడుతున్నాడు.

  నరాలు తెగేలా కష్టపడుతున్న ఎన్టీఆర్

  నరాలు తెగేలా కష్టపడుతున్న ఎన్టీఆర్

  తెరపై అభిమానులను అలరించడానికి తెర వెనక నటులు ఎంత కష్టపడతారో, పాత్రకు తగిన విధంగా పర్ఫెక్ట్ లుక్‌లో కనిపించడానికి ఎంతలా చెమటోడుస్తారో..... ఎన్టీఆర్‌కు సంబంధించిన ఈ ఫోటోలే నిదర్శనం. నరాలు తెగిపోతాయేమో? అనేంతలా తారక్ కష్టపడుతున్నాడు.

   ఫ్యాన్స్‌లో ఉత్సాహం....

  ఫ్యాన్స్‌లో ఉత్సాహం....

  సాధారణంగా సినిమా హీరోలను అభిమానులు ఫాలో అవుతుంటాయి. వారి స్టైల్, యాటిట్యూడ్ అనుకరించే ప్రయత్నం చేస్తారు. ఎన్టీఆర్ జిమ్‌లో కష్టపడుతున్న ఈ ఫోటోలు యువత ఇన్స్‌స్పైర్ అయ్యేలా చేస్తున్నాయి. కొందరు ఫ్యాన్స్ ఉత్సాహంగా జిమ్ వైపు అడుగులు వేస్తున్నారు.

   20 కేజీలు తగ్గిన ఎన్టీఆర్

  20 కేజీలు తగ్గిన ఎన్టీఆర్

  ‘జై లవ కుశ' సినిమా పూర్తయిన తర్వాత తన పూర్తి ఫోకస్ ఫిట్‌నెస్ మీదనే పెట్టారు ఎన్టీఆర్. ఇప్పటి వరకు దాదాపు 20 కేజీల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌తో ఇన్ని కసరత్తులు చేయిస్తున్న త్రివిక్రమ్ స్క్రీన్ మీద యంగ్ టైగర్‌ను ఎలా చూపించబోతున్నారో చూడాలి.

  ఫేక్ ఫోటోస్ కూడా ...

  ఫేక్ ఫోటోస్ కూడా ...

  ఎన్టీఆర్‌కు సంబంధించిన ఫేక్ ఫోటోస్ కూడా గతంలో నెట్లో వైరల్ అయ్యాయి. అయితే వీటిపై వెంటనే స్పందించిన స్టీవెన్ లాయిడ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా వివరణ ఇచ్చారు.

  English summary
  Jr NTR will be seen teaming up with Trivikram for the first time. Well-known fitness trainer Lloyd Stevens, who has worked with Ranveer Singh and Hrithik Roshan, has been hired to work closely with Jr NTR throughout the course of this project. While some speculate he might sport six-pack abs, there are also reports that he’ll shed weight for a much leaner look.
  దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more