»   » ప్రభాస్ న్యూ లుక్: అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్

ప్రభాస్ న్యూ లుక్: అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

దాదాపు మూడు నాలుగు సంవత్సరాల పాటు బాహుబలి కారణంగా తమ అభిమాన హీరో ప్రభాస్‌ను ఒకే లుక్‌లో చూసిన అభిమానులు.... ఆయనకు సంబంధించి కొత్త లుక్ ఏది వచ్చినా ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా ప్రభాస్ న్యూ లుక్ విడుదలవ్వగా అభిమానులు మురిసిపోయారు.

ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడు, అతడి స్టైల్, ఫిజిక్ ప్రజంటేషన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆతృత అభిమానుల్లో ఉంది.


లేటెస్ట్ లుక్ ఇదే...

లేటెస్ట్ లుక్ ఇదే...

ప్రభాస్ లేటెస్ట్ లుక్ ఇదే అంటూ... పీఆర్వో వంశీ తన ట్విట్టర్లో ఓ పోస్టు చేశారు. ఈ ఫోటోకు అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే సమయంలో ఈ ఫోటోలో ప్రభాస్ కాస్త తేడాగా కనిపిస్తున్నాడనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.


Prabhas Saaho Movie Shoot Begins with Prabhas Anushka's Romance
సాహో

సాహో

ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో' చిత్రం చేస్తున్నారు. ప్రభాస్ కెరీర్లో ఇది 19వ సినిమా. రూ. 150 కోట్ల బడ్జెట్ ఖర్చు పెడుతున్నపుడు అందుకు తగిన విధంగానే మార్కెటింగ్ ప్లాన్స్ కూడా ఉంటాయి. నిర్మాతలు అవన్నీ బేరీజు వేసుకుని మరీ ఇంత బడ్జెట్ పెట్టడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.


హీరోయిన్ కోసం వేట

హీరోయిన్ కోసం వేట

‘సాహో' చిత్రానికి సంబంధించి హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. ఆ మధ్య అనుష్క పేరు వినిపించినా ఆమె బరువు ఎక్కువగా ఉండటం, ఈ సినిమాలో ప్రభాస్ చాలా బరువు తగ్గి కనిపించే పాత్ర కావడంతో ఆమెను కాదనుకున్నారట.


షూటింగ్ విశేషాలు

షూటింగ్ విశేషాలు

ప్రస్తుతం ‘సాహో' మూవీ షూటింగ్ ప్రారంభం అయినా ఇంకా ప్రభాస్ జాయిన్ కాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం విలన్ నీల్ నితిన్ ముఖేష్ మీద కొన్ని సీన్లు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరున ప్రభాస్ షూటింగులో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.English summary
Check out Latest Photo of Young Rebel Star Prabhas. Prabhas’s latest look has blown the fans minds with such a sleek and handsome face. He is way cute now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu