మహానటి సినిమా లేటెస్ట్ న్యూస్, చిత్ర యూనిట్ అంతా ఒక్క చోటికి!
''తరాలను నిర్మించే స్త్రీ జాతి కోసం.. తరతరాలు గర్వించే కథ మహానటి సావిత్రి కథ''. తన అంద చందాలతోనే కాదు, గుణగణాలతోను ఇప్పటికీ తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటి మహానటి సావిత్రి. ఈ మహానటి రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను ఎందరికో స్పూర్తిదాయకంగా నిలిచింది. ఇప్పుడు ఆ మహానటి జీవితం ఆధారంగా ఓ మూవీ ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా విడుదల చేసిన ఈ సినిమా టిజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాలో నటించిన నటీనటుల పాత్రలు త్వరలో పోస్టర్స్ ద్వారా విడుదల చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. మే ఒకటిన ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గా చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. సినిమాలో నటించిన నటీనటులంతా ఈ ఈవెంట్ లో పాల్గొనబోతున్నారు.

మిక్కీ జె.మేయర్ అందించిన పాటలు అలనాటి పాత పాటలకు దీటుగా ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది. మే 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినియా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకు బుర్రా సాయి మాధవ్ మాటలు రాయడం జరిగింది.


Click it and Unblock the Notifications











