వెంకటేష్, వరుణ్ తేజ్ సినిమా లేటెస్ట్ న్యూస్!
పటాస్, సుప్రీం, తర్వాత 'రాజా ది గ్రేట్' సినిమాతో ముచ్చటగా మూడు సినిమాలు సక్సెస్ కొట్టి హ్యాట్రిక్ హిట్స్ డైరెక్టర్స్ జాబితాలో చేరిన అనిల్ రావిపూడి కొత్త సినిమా వెంకటేష్, వరుణ్ తేజ్ తో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఎఫ్2 పేరుతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ దశలో ఉంది.
వెంకటేష్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించబోతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మెహరిన్ నటించబోతోంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ రెండో వారం నుండి ప్రారంభం కాబోతోందని సమాచారం. కామెడి ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందించబడుతోందని దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల ఇంటర్వ్యూ లో తెలిపారు.

నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. వరుణ్ తేజ్ ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. స్పేస్ నేపధ్యంలో తెరకేక్కబోతున్న ఈ సినిమాలో అదితి రావ్ హైద్రి , లావణ్య త్రిపాటి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.


Click it and Unblock the Notifications











