డబ్బుల కోసమేనా? పూనమ్ కౌర్ సంచలన ట్వీట్, ఫీలైన పవన్ ఫ్యాన్స్... ఇదీ వాస్తవం!
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, కత్తి మహేష్ మధ్య కొన్ని రోజుల క్రితం చాలా పెద్ద గొడవే జరిగింది. ఈ గొడవలో పవన్ కళ్యాణ్‌కు సపోర్టుగా మాట్లాడిన హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా కత్తి మహేష్ మాటల దాడికి గురైంది. ఆమెపై కత్తి సంచలన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు, మహేష్ కత్తి రాజీ పడటం అందరికీ తెలిసిందే.

పూనమ్ కౌర్ ట్వీట్
తాజాగా పూనమ్ కౌర్ చేసిన ఓ ట్వీట్ సంచలనంగా మారింది. ఎవరిని ఉద్దేశించిన చేసిందో తెలియదు గాని, ఆ ట్వీట్ చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులకు అగ్గిమీద గుగ్గిలంలా మండి పోతున్నారు. దీంతో ఆమె మరో ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చారు.
డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు.
`డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు.. మీ అస్తిత్వం ఏంటి? అవసరాల కోసం మారిపోయిన నిజాయితీ.. నీ గుణం ఏంటి?` అంటూ పూనమ్ ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ తమ హీరో పవన్‌ను ఉద్దేశించే పూనమ్ చేసిందని కొందరు భావించి ఆమెపై ఎదురుదాడి ప్రారంభించారు.
వివరణ ఇచ్చుకున్న పూనమ్
తాను చేసిన ట్వీట్ అభిమానులు మరో రకంగా అర్థం చేసుకోవడం పూనమ్ వివరణ ఇచ్చుకుంది. ఆ ట్వీట్ ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చేసింది కాదని, డబ్బు కోసం ఓ కూతుర్ని అమ్ముకున్న తండ్రిని ఉద్దేశించి చేసిందని తెలిపారు.
Recommended Video

ఆ అమ్మాయి స్ట్రెంత్ నన్ను ఇన్‌స్పైర్ చేసింది
ఆ అమ్మాయి స్ట్రెంత్ నన్ను ఎంతగానో ఇన్స్ స్పైర్ చేసింది. ప్రస్తుతం ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసి తన కాళ్ల మీద తాను నిలబడింది అని పూనమ్ కౌర్ తెలిపారు.


Click it and Unblock the Notifications











