రేణు దేశాయ్ తర్వాత ఈమే: పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఖరారు!

By Bojja Kumar

హైదరాబాద్: 'సర్దార్ గబ్బర్ సింగ్' డిజాస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా శరత్ మరార్ నిర్మాణంలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయమై కొంతకాలంగా కన్‌ఫ్యూజన్ నెలకొంది. ఎట్టకేలకు నిర్మాత శరత్ మరార్ ఈ విషయమై అఫీషియల్ ప్రకటన చేసారు.

'పవన్ కళ్యాణ్ మూవీలో శృతి హాసన్' హీరోయిన్ గా ఖరారైంది. ఆగస్టు నుండి షూటింగ్ ప్రారంభం అవుతుంది. డైరెక్టర్ డాలీ అండ్ టీం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు' అని శరత్ మరార్ ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. తన మాజీ భార్య రేణు దేశాయ్ తో తప్ప పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఏ హీరోయిన్ తోనూ రెండో సారి చేయలేదు. రేణు దేశాయ్ తర్వాత పవన్ కళ్యాణ్ తో రెండోసారి నటిస్తున్న హీరోయిన్ శృతి హాసన్ మాత్రమే అని అంటున్నారు.

shruti haasan-renu desai

ఆ ప్రచారం నిజమేనా?

గతంలో దర్శకత్వం వహించిన జానీ...ఇటీవల పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్లే అందించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డ సంగతి తెలిసిందే. ఇలా సినిమా స్క్రిప్టులో వేలు పెట్టి గెలికి రెండు సార్లు దెబ్బతిన్న పవన్ కళ్యాణ్ మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నారట.

 Latest Update About Pawan Kalyan's Next, Producer Clears The Air

సర్దార్ గబ్బర్ సింగ్ మాదిరిగానే ఈ సినిమా కూడా చేతులు మారింది. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఎస్.జె.సూర్య చేతి నుండి డైరెక్టర్ డాలీ(కిషోర్ పార్ధసాని... గోపాల గోపాల ఫేం) చేతిలోకి వచ్చింది. 'సర్దార్ గబ్బర్ సింగ్' మూవీ రిజల్ట్ అంచనాలను తారుమారు చేసిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై చాలా కేర్ తీసుకుంటున్నారు.

'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా విషయంలోనూ ఎలాంటి ప్రయోగాలకు పోకుండా జాగ్రత్తగానే తీసినప్పటికీ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్ మిస్సవ్వడమే దెబ్బతీసిందని భావించిన పవన్ కళ్యాణ్ అండ్ టీం తాజా సినిమాలో అవన్నీ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X