'గాడ్ సెక్స్&ట్రూత్' ఫోటోస్ లీక్: పచ్చిగా తీస్తున్నారట?.. ఎంతలా అంటే?
Recommended Video

ఆర్జీవి.. కొంతమంది విపరీతంగా అభిమానించే వ్యక్తి, ఎక్కువమంది విపరీతంగా ద్వేషించే వ్యక్తి. అభిమానమైనా.. ద్వేషమైనా.. ఈ రెండూ ఆయనకు డోంట్ కేర్. నా ఆలోచనలు.. నా సినిమాలు.. నా ప్రపంచం.. ఒకరకంగా నేనో పచ్చి స్వార్థపరున్ని అని ఎన్నోసార్లు చెప్పేశాడు. ఏదేమైనా ఆర్జీవి మెంటాలిటీ చాలామందికి పచ్చి బూతుగా కనిపిస్తే.. ఆయన్ను అభిమానించేవాళ్లకు మాత్రం అందులో ఏదో తాత్వికత కనిపిస్తుంది. ఇప్పుడు గాడ్ సెక్స్&ట్రూత్ విషయంలోనూ అదే జరుగుతోంది..

'గాడ్,సెక్స్&ట్రూత్' షూటింగ్..:
గాడ్,సెక్స్&ట్రూత్ పోస్టర్ రిలీజ్ అవగానే చాలామంది నోరెళ్లబెట్టారు. అంతకుముందు గన్స్&థైస్, 'ఎక్స్'తో వర్మ ఇచ్చిన షాక్ మరిచిపోకముందే.. ఈసారి మరింత బోల్డ్ నెస్ తో యూట్యూబ్‌ను షేక్ చేయబోతున్నాడు. అయితే రిలీజ్ అయిన పోస్టర్ చూసే ఇంత షాక్ తింటున్నవాళ్లు.. సినిమా చూస్తే ఇక అంతే అన్న ప్రచారం జరుగుతోంది. అంత బోల్డుగా ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారట వర్మ.

ఫోటోస్ లీక్:
జీఎస్‌టీ షూటింగ్‌కు సంబంధించి కొన్ని ఫోటోలు లీకైనట్లు ప్రచారం జరుగుతోంది. బయటకొచ్చిన కొన్ని ఫోటోల్లో ఆర్జీవి తెరకెక్కిస్తున్న విధానం మైండ్ బ్లాక్ చేసేలా ఉందట. అయితే ఇక్కడ కూడా ఆర్జీవి గొప్పతనాన్ని పొగడుతున్నవారు లేకపోలేదు. అంతటి నగ్న సౌందర్యాన్ని ఎదురుగాపెట్టుకుని.. మరో ఆలోచన ఏమాత్రం లేకుండా కేవలం షూటింగ్ పైనే ఫోకస్ చేయడం వర్మకే సాధ్యమంటున్నారు.

బోల్డుగా..:
జీఎస్‌టీ షూటింగ్‌కు సంబంధించి లీకైన ఫోటోల్లో ఒకటి అమ్మాయి నగ్నంగా బోర్లా పడుకుని ఉండగా ఆర్జీవి ఆమె ఎదురుగా నిలుచుని యాక్షన్, కట్ చెబుతున్న ఫోటో అని తెలుస్తోంది. ఇక మరొక ఫోటోలో మానిటర్‌లో ఆర్జీవి సీన్‌ను పరిశీలిస్తుండగా.. పక్కనే మియా మాల్కోవా నగ్నంగా నిలుచుని ఉందట.

షాక్ మీద షాక్ తప్పదా?:
పోస్టర్ చూసే గగ్గోలు పెడుతున్నవాళ్లకు సినిమా చూస్తే షాక్ మీద షాక్ తప్పదనేలా ఆర్జీవి జీఎస్ టీని తెరకెక్కిస్తున్నారట. బయటకు లీకైన రెండు పోస్టర్లను బట్టి జీఎస్ టీ ఇండియన్ సినిమాలోనే అత్యంత బోల్డుగా ఉండబోతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తెలివిగా వ్యవహరిస్తున్న వర్మ:
జీఎస్‌టీ విషయంలో వర్మ చాలా లాజికల్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో షూట్ చేసి ఇక్కడి నుంచే రిలీజ్ చేస్తే సమస్య వస్తుందన్న ఉద్దేశంతో యూరోప్‌లో షూట్ చేసి అక్కడినుంచే రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఇక్కడ మహిళా సంఘాలు, బీజేపీ లాంటి సంస్థలు ఆర్జీవిని టార్గెట్ చేసినా పెద్దగా సమస్య తలెత్తదని భావిస్తున్నారట.

ఆరోజే ఎందుకు రిలీజ్?:
మొత్తానికి జనవరి 26న దేశమంతా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉన్నవేళ జీఎస్ టీ విడుదల కాబోతోంది. ఆరోజు జీఎస్‌టీకి వచ్చే వ్యూస్‌ను బట్టి మనదేశంలో ఎంతమంది పోర్న్ అంటే ఆసక్తి చూపిస్తున్నారు అన్నదానికి మరో ప్రత్యక్ష ఉదాహరణ దొరకవచ్చు. సెక్స్ విషయంలో ఒక మహిళా స్వేచ్చా స్వాతంత్య్రాల గురించి చెబుతున్నాను కాబట్టే రిలీజ్‌కు ఆ డేట్‌ను ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు వర్మ.


Click it and Unblock the Notifications











