బాలయ్య, బోయపాటి కూడా బాక్సాఫీస్ యుద్ధానికి సిద్ధమయ్యారా?
సినిమా ఇండస్ట్రీలలో థియేటర్స్ ఓపెన్ అవ్వాలని, మళ్ళీ ఎప్పటిలానే జనాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయాలని చాలా మంది సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ లాక్ డౌన్ సినిమా ఇండస్ట్రీని గట్టి దెబ్బె కొట్టింది. ఓటీటీలో కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికి పెద్ద హీరోలు మాత్రం థియేటర్స్ కోసమే ఎదురుచూస్తున్నారు.
ఇక బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ కూడా థియేటర్స్ ఓపెన్ అయిన తరువాతనే సినిమా రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేయాలని అనుకుంటున్నారు. అయితే ముందుగా మాత్రం సంక్రాంతి అని ఒక ప్లాన్ ప్రకారం షూటింగ్ ని పూర్తి చేయనున్నారట. ఒకవేళ సంక్రాంతికి గనక పరిస్థితులు చక్కబడితే పోటీ మాత్రం గట్టిగానే ఉంటుంది. థియేటర్స్ దొరకడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో పాటు KGF 2 లాంటి పెద్ద సినిమాలు ఉన్నాయి.

రవితేజ క్రాక్ సినిమాతో పాటు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు ముందు నుంచి సంక్రాంతి కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ నాలుగు సినిమాల మధ్యలో బాలయ్య BB3 ఎలా వస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది. మరి బాలకృష్ణ ఎంతవరకు ధైర్యం చేస్తాడో చూడాలి. ఇక మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు టాక్. అలాగే ఒక యువ హీరో కూడా స్పెషల్ పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











