రానా సినిమా కూడా ఓటీటీలోనే రిలీజ్ కానుందా.. నిజమెంత?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు ఓటీటీ ప్రపంచంలోకి వచ్చేస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా వరుసగా చాలా సినిమాలు డిజిటల్ ప్రపంచంలో డైరెక్ట్ గా విడుదల అవుతున్నాయి. ఇక రానా దగ్గుబాటి సినిమా కూడా త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్నట్టుకు కొన్ని రూమర్స్ వచ్చాయి.
ఆ సినిమా మరేదో కాదు. రానా, సాయి పల్లవి కీలక పాత్రలో నటిస్తున్న విరాటపర్వం. ప్రియమణి కూడా అందులో ఒక ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు ఏండింగ్ కి వచ్చేసింది. మిగిలిన షూటింగ్ కూడా ఫినిష్ చేయడానికి దర్శకుడు వేణు ఉడుగుల ప్లాన్ వేసుకున్నట్లు కూడా కథనాలు వెలువడ్డాయి. నిజానికి సినిమా షూటింగ్ కోసం అయితే ప్లాన్స్ రూపొందుతున్నాయి గాని ఓటీటీ రిలీజ్ పైన మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదట.

వీలైనంత వరకు సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి పాత్రతో పాటు రానా క్యారెక్టర్ కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉంటాయట. కేవలం కథ మీద నమ్మకంతోనే ఈ ప్రాజెక్ట్ చేయడానికి రానా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. రెమ్యునరేషన్ కూడా తక్కువగానే తీసుకున్నట్లు టాక్. ఇక వచ్చే ఏడాది సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











