సమంత, శర్వానంద్ 96 రీమేక్.. మారనున్న టైటిల్!
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 96 చిత్రాన్ని రీమేక్ చేస్తున్నట్లు ఇది వరకే ప్రకటించారు. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 చిత్రం ఘన విజయం సాధించింది. తెలుగులో కూడా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని సినిమా ప్రారంభం కాకముందే దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారు. 96 రీమేక్ లో సమంత, శర్వానంద్ జంటగా నటిస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ ప్రారంభించాలని దిల్ రాజు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఒరిజినల్ వర్షన్ తెరకెక్కించిన ప్రేమ్ కుమారే తెలుగు రీమేక్ కు కూడా దర్శత్వం వహించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రేమ కథగా తెరకెక్కిన 96 చిత్రం గత ఏడాది తమిళంలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

తాజా సమాచారం ప్రకటం దిల్ రాజు ఈ చిత్ర టైటిల్ ని మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లుగా, కథకు సరిపడేలా మంచి టైటిల్ కోసం ఆలోచిస్తున్నారట. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











