twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాళ్ళు ఒప్పుకుంటే వెండితెరపై SPB బయోపిక్.. మొదటిసారి క్లారిటీ ఇచ్చిన బడా వ్యాపారవేత్త

    |

    గాన గంధర్వుడు ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం మరణించి నెలలు గడుస్తున్నా ఇంకా ఆయన వదిలిన వెళ్లిన రోజును అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. 2020 లో సినీ ప్రపంచంలో ఎన్నో విషాద ఛాయలు అలుముకున్న విషయం తెలిసిందే. తెలుగు వారి అభిమానులను ఒక్కసారిగా షాక్ కు గురి చేసిన ఘటన ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం మరణం. ఇక చాలా రోజుల తరువాత ఎస్పీబీ బయోపిక్ చర్చల్లోకి రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఆ విషయంపై స్పందించారు.

    భాషతో సంబందం లేకుండా..

    భాషతో సంబందం లేకుండా..

    ఆల్ టైమ్ ఇండియన్ బెస్ట్ సింగర్స్ లిస్ట్ తీస్తే అందులో ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం నెంబర్ వన్ స్థానంలో ఉంటారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. భాషతో సంబంధం లేకుండా సంగీత ప్రపంచంలో 45వేలకు పైగా పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యం అంటే ఒక దైవంలా చూసేవాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. భౌతికంగా మన దగ్గర లేకపోయినప్పటికీ పాటతో ప్రతి రోజు పలకరిస్తూనే ఉంటారని ప్రముఖ గాయకులు గుర్తు చేసుకుంటున్నారు.

    ప్రాణాలతో పోరాడుతూ..

    ప్రాణాలతో పోరాడుతూ..

    గత ఏడాది సెప్టెంబర్ 25న బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. కోవిడ్ పాజిటివ్ వలన హాస్పిటల్ జాయిన్ అయిన బాలసుబ్రహ్మణ్యం నెలరోజులకుపైగా ప్రాణాలతో పోరాడుతూ తుది శ్వాస విడువడం సంగీత లోకాన్ని షాక్ కు గురి చేసింది.

    అంత ఈజీ కాదు

    అంత ఈజీ కాదు

    అనుకోకుండా వచ్చి సినిమా సంగీత ప్రపంచంలో అగ్ర గాయకుడిగా ఎదిగిన బాలసుబ్రహ్మణ్యం బయోపిక్ పై గత ఏడాది నుంచి కూడా అనేక రకాల కథనాలు వస్తున్నాయి. అయితే ఎస్పీబీ పాత్రకు తగ్గట్లు నటించే నటులు దొరకడం ఒక ఎత్తైతే ఆయన సింగింగ్ కు తగ్గట్లుగా పాటలు పడటం మరొక ఎత్తు. బాలసుబ్రహ్మణ్యంలా పాటలు పాడటం అంత సులువైన విషయం కాదని అందరికి తెలిసిందే.

    వాళ్ళు అనుమతి ఇస్తే..

    వాళ్ళు అనుమతి ఇస్తే..

    ఇటీవల హృదయాంజలి అనే మ్యూజికల్ ప్రోగ్రామ్ లో సింగర్స్ అందరూ ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యంకు నివాళులర్పించారు. ఇక బాలు గారికి అత్యంత సన్నిహితులైన శుభోదయం గ్రూప్ చైర్మెన్ లక్ష్మీ ప్రసాద్ మొదటిసారి బాలసుబ్రహ్మణ్యం బయోపిక్ పై క్లారిటీ ఇచ్చారు. వారి కుటుంబ సభ్యులు అనుమతి ఇస్తే తప్పకుండా బాలసుబ్రహ్మణ్యం గారి బయోపిక్ ను వెండితెరపైకి తీసుకువస్తామని అన్నారు. మరి ఈ విషయంపై ఎస్పీబీ కుటుంబ సభ్యులు ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.

    English summary
    Although months have passed since the death of singer SP Balasubramanian, fans still cannot forget the day he left. It is known that in 2020, many tragic shadows will fall on the world of cinema. The death of SP Balasubramanian shocked the Telugu fans at once. Several days later the SPB biopic became a hot topic in discussions. Recently a prominent businessman responded to the matter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X