Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్లుగా భారీ యాక్షన్ సీన్స్.. ఇదిగో ఇదే ఉదాహరణ
సాధారణం గానే స్టార్ హీరోల సినిమా అప్డేట్స్ అంటే ఎంతో ఆసక్తి సదరు హీరోల అభిమాన వర్గాలకు. అదీ వరల్డ్ స్టార్ ప్రభాస్ సినిమా విశేషాలంటే ఇంకేమన్నా ఉందా! మీద మీద పడి తెలుసుకుంటారు నెటిజన్లు. తాజాగా అలాంటి సందర్భమే ఒకటి జరిగింది. సాహో సినిమా షూటింగ్లో ఉపయోగించిన ఓ కారును చూపిస్తూ దానికి సంబందించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా నటుడు మురళీ శర్మ షేర్ చేశాడు. దీంతో వెంటనే ఎగబడిన ప్రభాస్ ఫాన్స్ ఈ వీడియోను ఇట్టే వైరల్ చేసేశారు.
భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపుదిద్దుకుంటోంది సాహో మూవీ. మునుపెన్నడూ చూడని విధంగా కానీ వినీ ఎరుగని రీతిలో ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ ఉంటాయని ఇప్పటికే చిత్రయూనిట్ చెప్పేసింది. అందుకు తగ్గట్టుగా సాధారణ సినిమాలకు భిన్నంగా ఆలోచించి షేడ్స్ ఆఫ్ సాహో రూపంలో పలు వీడియోలు రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. దీంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సాహో కారు అంటూ ధ్వంసమైన కారు వీడియో పెట్టి ప్రేక్షకుల్లోని ఆసక్తికి రెక్కలు కట్టాడు మురళి. ఈ వీడియో చూసిన నెటిజన్లు సినిమాలో కార్ చేజింగ్స్, ఫైట్స్ ఎలా హోరెత్తించనున్నాయో ఉహించుకుంటున్నారు.
బాహుబలి విజయం తర్వాత సాహూ రూపంలో భారీ ప్రాజెక్టు చేపట్టారు ప్రభాస్. యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై 250 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో నీల్ నితిన్ ముకేష్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్ తదితరులు ముఖ్య పోషిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఆగస్టు 15 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.