twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్లుగా భారీ యాక్షన్ సీన్స్.. ఇదిగో ఇదే ఉదాహరణ

    |

    సాధారణం గానే స్టార్ హీరోల సినిమా అప్‌డేట్స్ అంటే ఎంతో ఆసక్తి సదరు హీరోల అభిమాన వర్గాలకు. అదీ వరల్డ్ స్టార్ ప్రభాస్ సినిమా విశేషాలంటే ఇంకేమన్నా ఉందా! మీద మీద పడి తెలుసుకుంటారు నెటిజన్లు. తాజాగా అలాంటి సందర్భమే ఒకటి జరిగింది. సాహో సినిమా షూటింగ్‌లో ఉపయోగించిన ఓ కారును చూపిస్తూ దానికి సంబందించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా నటుడు మురళీ శర్మ షేర్ చేశాడు. దీంతో వెంటనే ఎగబడిన ప్రభాస్ ఫాన్స్ ఈ వీడియోను ఇట్టే వైరల్ చేసేశారు.

    భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపుదిద్దుకుంటోంది సాహో మూవీ. మునుపెన్నడూ చూడని విధంగా కానీ వినీ ఎరుగని రీతిలో ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ ఉంటాయని ఇప్పటికే చిత్రయూనిట్ చెప్పేసింది. అందుకు తగ్గట్టుగా సాధారణ సినిమాలకు భిన్నంగా ఆలోచించి షేడ్స్ ఆఫ్ సాహో రూపంలో పలు వీడియోలు రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. దీంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సాహో కారు అంటూ ధ్వంసమైన కారు వీడియో పెట్టి ప్రేక్షకుల్లోని ఆసక్తికి రెక్కలు కట్టాడు మురళి. ఈ వీడియో చూసిన నెటిజన్లు సినిమాలో కార్ చేజింగ్స్, ఫైట్స్ ఎలా హోరెత్తించనున్నాయో ఉహించుకుంటున్నారు.

    Latest vedio tells how actions seens are in Saaho

    బాహుబలి విజయం తర్వాత సాహూ రూపంలో భారీ ప్రాజెక్టు చేపట్టారు ప్రభాస్. యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై 250 కోట్లకు పైగా బడ్జెట్‌‌తో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో నీల్‌ నితిన్‌ ముకేష్‌, వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, అరుణ్‌ విజయ్‌ తదితరులు ముఖ్య పోషిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఆగస్టు 15 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

    English summary
    Young rebal star Prabhas new movie Saaho. This movie is directed by sujeeth. The shooting is successfully going on. Latest vedio tells how actions seens are in saaho movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X