twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    MAA Electionsలో తీవ్ర ఉద్రిక్తత : వారి మీద లాఠీఛార్జ్, మునుపెన్నడూ లేనివిధంగా వోటింగ్!

    |

    ఈసారి మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల పోలింగ్ విషయంలో అనేక చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక సంఘటనలు చోటు చేసుకుంటూ ఉండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉదయాన్నే రిగ్గింగ్ ఆరోపణలు రావడంతో కొద్దిసేపటి పాటు ఎన్నికల పోలింగ్ ఆపివేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హేమ శివ బాలాజీ చేతిని కొరకడం కూడా సంచలనంగా మారింది. ఇప్పుడు తాజాగా లాఠీచార్జి చేసిన ఘటన సంచలనం మారుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

    మునుపెన్నడూ లేని విధంగా

    మునుపెన్నడూ లేని విధంగా

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన పోలింగ్ కూడా దాదాపు పూర్తి కావస్తుంది.. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓటింగ్ బాగా ఎక్కువగా నమోదవుతోంది. మామూలుగా 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ కి సమయం ఇవ్వగా మధ్యలో కొంత సమయం వృధా అయిన కారణంగా ఇప్పుడు పోలింగ్ సమయాన్ని పెంచారు.

    రికార్డు స్థాయి వోటింగ్

    రికార్డు స్థాయి వోటింగ్

    మంచు విష్ణు ప్రకాష్ రాజ్ లతో చర్చించి ఎన్నికల అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు నమోదైన సమాచారం మేరకు 580 మంది ఇప్పటిదాకా ఓటు వేశారు. ఎన్నికల ప్రక్రియ మొదలయిన తరువాత ఇదే రికార్డు స్థాయి పోలింగ్ అని చెబుతున్నారు. ఇప్పటివరకు అయితే 56 శాతం పోలింగ్ జరిగింది. ఇక మరో 150 మంది కూడా ఇప్పుడు క్యూ లో ఉన్నారని తెలుస్తోంది.

    ఫోన్ చేసి రమ్మంటే

    ఫోన్ చేసి రమ్మంటే


    ఇక రిగ్గింగ్ ఆరోపణలతో కొంచెం సేపు పోలింగ్ నిలిచి పోయిన కారణంగా గంట పొడిగిస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే 3 గంటల వరకు పోలింగ్ కొనసాగుతోందని, ట్రాఫిక్ వల్ల చాలామంది రాలేక పోతున్నారని, ఎలక్షన్ అధికారులను రిక్వెస్ట్ చేస్తే టైం పొడిగించారని మంచు విష్ణు పేర్కొన్నారు. ఇంకో 100 మంది ఓటు వెయ్యటానికి వస్తారని, ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి రమ్మంటే అందరూ వచ్చారని మంచు విష్ణు పేర్కొన్నారు. ఇక

    రామ-రావణ యుద్ధం

    రామ-రావణ యుద్ధం


    ఓటు వేసిన తర్వాత 'మా' సభ్యులు ఐదు నిమిషాల్లో వెళ్లిపోవాలని సినీ నటుడు మోహన్‌బాబు వారిని కోరారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని ఈ సందర్భంగా మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు. 'ఈ గొడవలన్నీ ఎందుకు జరుగుతున్నాయో నాకర్థం కావడం లేదన్నా ఆయన గెలుస్తామన్న నమ్మకం ఉందని అన్నారు. ప్రజలు, సాయిబాబా ఆశీస్సులతో విష్ణు గెలుస్తాడన్న ఆయన 'మా' సభ్యులే నా బలం అని, ఈ గొడవలు చూస్తుంటే రామ-రావణ యుద్ధంలా ఉంది. ఇదంతా అవసరమా? అనిపిస్తోందని ఆయన అన్నారు.

    Recommended Video

    Bigg Boss Telugu 5: Hamida కోసం విశ్వ ఎలిమినేట్ ? ఆమెకు తక్కువ ఓట్లు.. కానీ ! || Oneindia Telugu
    లాఠీ ఛార్జ్

    లాఠీ ఛార్జ్


    అయితే ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు లాఠీఛార్జి చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. హీరో అక్కినేని అఖిల్ తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ దగ్గరకు వచ్చిన క్రమంలో ఒక్కసారిగా అభిమానులు ఆయన తో సెల్ఫీ దిగేందుకు ఎగబడ్డారు. ఒక్కసారిగా వారంతా అఖిల్ మీద పడిపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని లాఠీ ఛార్జ్ చేసి చెదరగొట్టారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో అలాగే మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

    English summary
    lathicharge on akhil akkineni fans at maa elections polling booth.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X