జిల్లెట్ రేజర్ ప్రచార కార్యక్రమంలో బాలీవుడ్ హీరోయిన్లు
హైదరాబాద్: షేవింగ్ కిట్లు కేవలం మగాళ్ల కోసమే కాదు...మహిళలకు కూడా వాటి అవసం ఉంటుంది అని ప్రచారం మొదలు పెట్టారు బాలీవుడ్ సుందరాంగులు. మహిళల కోసం ప్రత్యేకంగా జిల్లెట్ కంపెనీ 'వెనస్' పేరుతో విడుదల చేసిన షేవింగ్ రేజర్లును బాలీవుడ్ ముద్దు గుమ్మలు నేహా దూపియా, చిత్రాంగద సింగ్, ఇషా గుప్తాలు విడుదల చేసారు.
వెనస్ రేజర్ల ప్రచారంలో భాగంగా నేహా దూపియా, ఇషా గుప్తా, చిత్రాంగద సింగ్ కాళ్లు, చేతులపై మొలిచిన అవాంచిత రోమాలను ఎలా తొలగించుకోవాలో అనే దాన్ని స్వయంగా షేవింగ్ చేసి చూపించారు. మహిళల సున్నితమైన చర్మానికి ఎలాంటి హాని, ఇబ్బంది కలుగకుండా అవాంచిత రోమాలను తొలగించడంతో వేనస్ రేజర్లు తొడ్పడుతాయని వారు చెబుతున్నారు.
కాళ్లు, చేతులతో పాటు మహిళ ఇతర శరీర భాగాల్లో పెరిగే అవాంచిత రోమాలను తొలగించుకోవడానికి ఈ రేజర్లను వాడటం ఉత్తమ మార్గమని ప్రచారం చేస్తున్నారు ఈ హీరోయిన్లు. స్లైడ్ షోలో ఫోటోలు.

షేవింగ్ చేసుకుంటూ..
జిల్లెట్ కంపెనీ కొత్తగా విడుదల చేసిన వెనస్ రేజన్లు ఎలా వాడాలనే దానిపై స్వయగా షేవింగ్ చేసుకుంటూ ప్రచారం చేస్తున్న హీరోయిన్లు.

మహిళలకు ఉత్తమమైన రేజర్
జిల్లెట్ వెనస్ రేజర్ మహిళల అవాంచిత రోమాలు తొలగించుకోవడానికి ఉత్తమమైనది అంటూ హీరోయిన్లు నేహా దూపియా, చిత్రాంగద సింగ్, ఇషా గుప్తాలు ప్రచారం చేస్తున్నారు.

చిత్రాంగద సింగ్
బాలీవుడ్ భామ చిత్రాంగ సింగ్ ఇప్పటకే పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. ఈ సంవత్సరం ఆమె నటించిన ఇంకార్, ‘ఐ,మి ఔర్ మే' చిత్రాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలేవీ లేవు. దీంతో వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన కార్యక్రమాల్లో బిజీ అయిపోయింది.

ఇషా గుప్తా
ఇషా గుప్తా ప్రస్తుతం పలు బాలీవుడ్ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. హమ్ షకల్ చిత్రంతో పాటు విశేష్ ఫిల్మ్ బేనర్లో ఓ సినిమా, ఉస్కో జానా కిదర్ హై అనే చిత్రంలో ఐటం సాంగులో నటిస్తోంది.

నేహా ధూపియా
నేహా ధూపియా ఇప్పటికే పలు బాలీవుడ్ చిత్రాలతో పాటు పలు సౌత్ చిత్రాలు, ఇతర భాషా చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె ఉంగ్లి అనే చిత్రంలో మాత్రమే నటిస్తోంది.


Click it and Unblock the Notifications











