'లవకుశ' యానిమేషన్ చిత్రం సక్సెస్
2డీ యానిమేషన్ చిత్రం 'లవకుశ'. ది వారియర్ ట్విన్స్ అనేది ఉపశీర్షిక. దవళ సత్యం దర్శకత్వంలో రాయుడు.వి.శశాంక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఆడియో శ్రోతలను విశేషంగా అలరిస్తోంది. నిర్మాత, క్రియేటివ్ డైరక్టర్ రాయుడు.వి.శశాంక్ మాట్లాడుతూ "కీర్తిశేషులు ఎల్.వైద్యనాథన్ స్వరాలను సమకూర్చారు.
స్వర్గీయ వేటూరి పాటలను రాశారు. అజరామరమైన 'లవకుశ' చిత్రాన్ని 2డీ యానిమేషన్‌లో రూపొందించాలనేది నా స్వప్నం. అందుకే ఖర్చుకు వెనకాడకుండా రూ.25కోట్ల భారీ వ్యయంతో అహర్నిశలు శ్రమించి నిర్మించాం. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తికావచ్చాయి. ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాఉ చేస్తున్నాం అని అన్నారు.


Click it and Unblock the Notifications











