మాట మార్చిన లావణ్య .. అది 100 పర్సెంట్ మోసమే, రాజ్ జైలుకెళ్లాల్సిందేనంటూ

రాజ్ తరుణ్ - లావణ్య- మాల్వీ మల్హోత్రా వ్యవహారం రోజురోజుకు మలుపులు తిరుగుతోంది. తనతో 11 ఏళ్లు సహజీవనం చేసి ఇప్పుడు హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో రాజ్‌తరుణ్ ఎఫైర్ పెట్టుకున్నాడంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందుకు కావాల్సిన ఆధారాలను సైతం ఆమె అందజేసింది. కొద్దిరోజులు రెండు వర్గాలు సైలెంట్ కావడంతో కేసు ముగిసిపోయిందనుకున్నారు. అయితే పోలీసులు దూకుడుగా ఉండటంతో రాజ్ తరుణ్ కేసు మరోసారి ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

లావణ్య ఫిర్యాదు ఆధారంగా హీరో రాజ్ తరుణ్‌పై నార్సింగి పోలీసులు ఐపీసీ సెక్షన్ 420, 493, 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువైన పక్షంలో ఆయనకు కఠినమైన శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు సైతం చెబుతున్నారు. రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారం మధ్యలోకి రకరకాల వ్యక్తులు ప్రవేశించారు. ఆర్జే శేఖర్ భాషా, ప్రీతి, మస్తాన్ సాయి వంటి వారు రకరకాల ఆరోపణలు చేశారు. ఓ చర్చా కార్యక్రమంలో ఆర్జే శేఖర్ భాషాపై లావణ్య చేయి చేసుకోవడం వివాదాస్పదమైంది.

Lavanya sensational comments on hero Raj Tarun here s the details

ఈ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా రాజ్‌తరుణ్‌కు నోటీసులు జారీ చేయగా, ఆయన హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకుని తన షూటింగ్స్‌లో బిజీ అయ్యాడు. ఇలాంటి దశలో పోలీసులు శుక్రవారం ఈ కేసులో ఛార్జ్‌షీట్ ఫైల్ చేశారు. ఇందులో ఏకంగా రాజ్‌తరుణ్‌ని నిందితుడిగా చేర్చడం కలకలం రేపింది. లావణ్య చెబుతున్న దానిలో వాస్తవాలు ఉన్నాయని, ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా సేకరించినట్లుగా పేర్కొన్నారు.

ఇంతలో రాజ్ తరుణ్ కోసం వెతుకుతున్న లావణ్య ముంబైకి వెళ్లింది. ఒకే ఫ్లాట్‌లో హీరోయిన్ మాల్వీ మల్హోత్రా, రాజ్ తరుణ్ ఉండటాన్ని గమనించిన ఆమె వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వారిద్దరూ సన్నిహితంగా ఉన్న దృశ్యాలను ఫోన్‌లో వీడియో తీసి వాటిని మీడియాకు లీక్ చేసింది. ఆ సమయంలో మాల్వీ - లావణ్య మధ్య వాగ్వాదం జరిగిందని కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే లావణ్యపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మాల్వీ వెళ్లినట్లుగా కథనాలు వచ్చాయి.

ఈ ఘటనల నేపథ్యంలో లావణ్య ఓ ఛానెనల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్ తరుణ్ లైఫ్‌లో నుంచి నేను వెళ్లిపోవాలని మాల్వీ కోరుకుందని.. రాజ్ కూడా తనను ఏదో విధంగా బయటికి పంపాలని ట్రై చేశాడని లావణ్య ఆరోపించింది. ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తుండటంతో షూటింగ్ పూర్తవ్వగానే మాల్వీతో రిలేషన్ ఎండ్ అయిపోతుందని అనుకున్నానని ఆమె చెప్పింది.

100 పర్సెంట్ రాజ్ నన్ను మోసం చేశాడని, తాళి కట్టలేదని మీడియాతో చెబుతున్నాడని ఆయనకు శిక్ష పడాలి , జైలుకెళ్లాలని లావణ్య తేల్చిచెప్పారు. చేయని నేరానికి తనను డ్రగ్స్‌ కేసులో ఇరికించారని మస్తాన్ సాయితో కాల్ మాట్లాడినందుకే ఇలా జరిగిందని ఆమె అన్నారు. అయితే రెండ్రోజుల క్రితం రాజ్ తనకు దక్కితే చాలని, ఆయన జైలుకెళ్లాలన్నది తన ఉద్దేశం కాదన్న లావణ్య ఇంతలోనే మాట మార్చడం ఏంటంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం లావణ్య వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: raj tarun lavanya malvi malhotra
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X