బికినీ వేసుకుంటే కథకి నప్పదని: ఉన్నది ఒకటే జిందగీలో ఆ సీన్ తీసేసారట
ఉన్నది ఒకటే జిందగీ సినిమా కోసం లావణ్యా త్రిపాఠి బికినీలో మెరిసిందట. కాని అక్కడ సినిమా కంటెంట్లో ఉన్న ప్రేమకథకి.. ఈ కమర్షియల్ గ్లామర్ కి పొంతన లేకపోవడంతో ..
Recommended Video

లావణ్యా త్రిపాఠి టాలీవుడ్ లోకి అందాల రాక్షసి లాంటి సినిమాతో అడుగు పెట్టి నటనకు మంచి మార్కులే వేయించుకుది కానీ అన్నీ అదే తరహా పాత్రలు రావటం తో తాను గ్లామర్ రేసులో వెనుక బడి పోతున్నానని గ్రహించింది. కానీ అప్పటికే పాపం జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ తర్వాత కాస్త గ్లామర్ డోస్ పెంచినా ఆకట్టుకోలేక పోగా ముందున్న ఇంప్రెషన్ మీద కూడా కాస్త దెబ్బ పడింది.

భలె భలె మగాడివోయ్
ఆ తరవాత వచ్చిన దూసుకెళ్తాలోనూ కనిపించింది. అయితే... లావణ్యకు గొప్ప అవకాశాలేం రాలేదు. నటిగా ఓకే గానీ, గ్లామర్ విషయంలో అత్తెసరు మార్కులు తెచ్చుకొంది. అయితే మారుతి సినిమా 'భలె భలె మగాడివోయ్'తో ఆమె దశ తిరిగింది. ఈ సినిమా తర్వాత వచ్చిన సోగ్గాడే చిన్ని నాయిన'లో మరింత గ్లామర్ గా కనిపించింది.

ఉన్నది ఒకటే జిందగీ
మరింత వన్నె తెచ్చుకొంటూ.. స్క్రీన్ ప్రెజెన్స్‌తో అందరి మతిపోగొట్టింది. అయితే ఆ క్రేజ్ కూడా ఎక్కువకాలం నిలబడాలంటే వార్తల్లో ఉండాలి కదా..., వార్తల్లో ఉండాలంటే ఆఫర్లూ ఉండాలి. అవే ఇప్పుడు కావల్సింది... ఇప్పటికైతే పాపం ఆశలన్నీ రామ్ హీరోగా వస్తున్న "ఉన్నది ఒకటే జిందగీ" పైనే ఆశలన్నీ పెట్టుకుంది.

నాకు గ్లామర్ రోల్స్ ఇవ్వండి
'నేను రియల్ లైఫ్ లో అందాల రాక్షసి క్యారక్టర్ కు ఇసుమంత దగ్గరగా కూడా ఉండను. అంతా కూడా మోడ్రన్ గానే ఉంటాను. అలాగే మోడలింగ్ సమయంలో కూడా గ్లామర్ నే ఒలకబోశాను. అందుకే నేను చాలాసార్లు నా డైరక్టర్లకు చెప్పాను.. నాకు గ్లామర్ రోల్స్ ఇవ్వండి అని. అంటూ తాను ఎక్స్పోజింగ్ కి సిద్దం అని చెప్పినా దర్శకులు మాత్రం అంత ధైర్యం చేయలేకపోయారు.

బికినీలో మెరిసిందట
అయితే ఎట్టకేలకు ఉన్నది ఒకటే జిందగీ సినిమా కోసం అమ్మడు బికినీలో మెరిసిందట. కాని అక్కడ సినిమా కంటెంట్లో ఉన్న ప్రేమకథకి.. ఈ కమర్షియల్ గ్లామర్ కి పొంతన లేకపోవడంతో .. ఈ బికినీ సీన్ ఎందుకులే అని ఎడిటింగ్ దగ్గరే తీసేశారని టాక్. . పాపం దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదని. హీరోయిన్ ఒప్పుకున్నా కథ మాత్రం అడ్డుపడిందన్న మాట. బికినీలో లావణ్యా త్రిపాఠిని చూడటానికి మళ్ళీ వెయిట్ చేయాలన్న మాట.


Click it and Unblock the Notifications











