నిర్మాతకు చుక్కలు చూపిస్తున్న లావణ్య త్రిపాఠి.. బాగా ముదిరిపోయిందట..

By Rajababu

Recommended Video

నిర్మాతకు చుక్కలు చూపిస్తున్న లావణ్య త్రిపాఠి..!!

అందంతోపాటు అభినయంతో ఆకట్టుకొంటున్న యువ హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి ఒకరు. టాలీవుడ్‌లో హెబ్బా పటేల్, క్యాథరిన్ త్రెసా, రాశీఖాన్నా లాంటి హీరోయిన్లను వెనక్కు నెడుతూ లావణ్య దూసుకుపోతున్నది. ఇటీవల కాలంలో భారీ సక్సెస్‌లను అందుకోవడంతో తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసిందట. లావణ్య త్రిపాఠి డిమాండ్‌ను కాదనలేక అమ్ముడు అడిగిన మొత్తాన్ని సదరు నిర్మాత సమర్పించుకొన్నాడనేది ఫిలింనగర్ సమాచారం.

 స్టార్ హీరోలతో జోడీ

స్టార్ హీరోలతో జోడీ

టాలీవుడ్‌లో కుర్ర హీరోలతోపాటు సీనియర్ స్టార్లతో కలిసి లావణ్య హిట్లు సాధించింది. నానితో భలే భలే మొగాడివోయ్, నాగచైతన్యతో యుద్ధం శరణం గచ్ఛామి, రామ్‌తో ఉన్నది ఒకటే జిందగీ చిత్రాల్లో నటించింది. ఇక నాగార్జునతో కలిసి సోగ్గాడే చిన్నాయనా అనే సినిమాలో కనిపించి.. మెప్పించింది.

స్టార్ హీరోయిన్‌గా ముద్ర

స్టార్ హీరోయిన్‌గా ముద్ర

వరుస విజయాలతో దూసుకెళ్తున్న లావణ్య త్రిపాఠికి ఎదురులేకుండా పోయింది. ఇలాంటి నేపథ్యంలో స్టార్ హీరోయిన్ అనే ముద్ర వేసుకొన్నది. దాంతో భారీగా రెమ్యునరేషన్ పెంచినట్టు సమాచారం. ఇంతకీ ఏ సినిమా కోసం, ఏ నిర్మాతను లావణ్య భారీగా డిమాండ్ చేసిందంటే..

 సాయి ధరమ్ తేజ్‌తో

సాయి ధరమ్ తేజ్‌తో

ఉన్నది ఒకటే జిందగి తర్వాత సాయిధరమ్ తేజ్, వీవీ వినాయక్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలో లావణ్య త్రిపాఠి నటిస్తున్నది. ఈ చిత్రం కోసం లావణ్యను నిర్మాత సీ కల్యాణ్ సంప్రదించారు. ఈ సందర్భంగా ఆమె రూ.50 లక్షలను డిమాండ్ చేసినట్టు సమాచారం.

 భారీగా రెమ్యునరేషన్ డిమాండ్

భారీగా రెమ్యునరేషన్ డిమాండ్

అయితే లావణ్య త్రిపాఠికి ఉన్నక్రేజ్ దృష్ణా లావణ్య త్రిపాఠి అడిగిన మొత్తాన్ని ఇచ్చేందుకు నిర్మాత ఒప్పుకొన్నడనేది లేటేస్ట్ న్యూస్. ఈ వ్యవహారాన్ని బట్టి లావణ్య త్రిపాఠి దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకొంటున్నాదని సినీ వర్గాలు అంటున్నారు.

తమిళ చిత్రాల్లో ఆఫర్లు

తమిళ చిత్రాల్లో ఆఫర్లు

ఇదిలా ఉండగా, లావణ్య త్రిపాఠి తమిళ చిత్ర పరిశ్రమలోను సినిమాలు చేస్తున్నది. సందీప్ కిషన్ సరసన మాయవన్ అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X