»   » వావ్ సెక్సీ!...అందాల రాక్షసి(హాట్ ఫోటోలు)

వావ్ సెక్సీ!...అందాల రాక్షసి(హాట్ ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: 'అందాల రాక్షసి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన లావణ్య త్రిపాఠి తన అందం, పెర్ఫార్మెన్స్‌తో తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో చూపించింది కొంతే...ఇక ముందే తనలోని అసలైన అందాలు చూస్తారు అనేలా ప్రవర్తిస్తోంది లావణ్య.

  ప్రస్తుతం మంచు విష్ణు సరసన 'దూసుకెళ్తా' చిత్రంలో నటిస్తున్న లావణ్య ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు హాట్ హాట్ ఫోటో షూట్లతో అభిమానులకు కనువిందు చేస్తోంది. మున్ముందు తెలుగు సినీ అభిమానులంతా ఆమె అందానికి దాసోహం అవడం ఖాయం అనేలా ఉన్నాయి ఆ ఫోటోలు....

  లావణ్య త్రిపాఠి సంబంధించిన హాట్ ఫోటోలు, దూసుకెళ్తా సినిమా వివరాల్లు స్లైడ్ షోలో చూద్దాం...

  లావణ్య త్రిపాఠి

  లావణ్య త్రిపాఠి


  ఉత్తర ఖండ్‌కు చెందిన లావణ్య త్రిపాఠి జులై 3, 1989లో జన్మించింది. మిస్ ఉత్తరఖండ్ టైటిల్ 2006లో దక్కించుకుంది.

  మోడలింగ్

  మోడలింగ్


  మిస్ ఉత్తర ఖండ్ టైటిల్ దక్కించుకున్నాక మోడలింగ్ రంగంలో అడుగు పెట్టిన లావణ్య అక్కడ కూడా మంచి మార్కులే కొట్టేసింది. ఆమె అందం, ఆటిట్యూడ్ అందరినీ మెప్పించే విధంగా ఉండటమే అందుకు కారణం.

  ఫ్యామిలీ

  ఫ్యామిలీ


  లావణ్య త్రిపాఠి ఉత్తరఖండ్ లో జన్మించింది. ఆమె తండ్రి హైకోర్టు లాయర్. ఆమె తల్లి ఉపాధ్యాయురాలుగా పని చేసింది. కానీ ఇప్పుడు హౌస్ వైఫ్ గా సెటిలైంది. ఆమె ఒక బ్రదర్, ఒక సిస్టర్ ఉన్నారు. ఇద్దరూ తనకంటే పెద్దవారు.

  చదువు

  చదువు


  డెహ్రడూన్లోనే స్కూలు విద్య పూర్తి చేసిన లావణ్య త్రిపాఠి, ముంబైలోని నేషనల్ కాలేజీ నుంచి ఎకనామిక్స్ లో గ్రాజ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె బ్రాహ్మణ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి.

  టీవీ కార్యక్రమాల్లో...

  టీవీ కార్యక్రమాల్లో...


  సినిమాల్లోకి రాకముందు ఆమె కొన్ని టీవీ కార్యక్రమాల్లో పాల్గొంది. హిందీలో ప్రసారం అయిన ‘ష్..కోయిహై', గెట్ గార్జియస్, ప్యార్ కా బంధన్ అనే కార్యక్రమాల్లో పాల్గొంది.

  హీరోయిన్‌గా..

  హీరోయిన్‌గా..


  లావణ్య త్రిపాఠి తెలుగులో వచ్చిన ‘అందాల రాక్షసి' చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఈ చిత్రంలో ఆమె మిధునగా ప్రేక్షకులను అలరించింది. హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకుడు.

  దూసుకెళ్తా...

  దూసుకెళ్తా...


  ఆమె తెలుగులో నటిస్తున్న 2వ చిత్రం ‘దూసుకెళ్తా' మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న ఈచిత్రానికి వీరూపొట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్, వారాహి చలన చిత్రం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

  దూసుకెళ్తాలో లావణ్య పాత్ర

  దూసుకెళ్తాలో లావణ్య పాత్ర


  లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.... ''తొలి సినిమా 'అందాల రాక్షసి'తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నాను. రెండో సినిమా అనేసరికి ఎలాంటి కథని ఎంచుకోవాలని ఆలోచనలో పడ్డాను. అయితే తొలిసినిమాకి భిన్నంగా ఉండాలి అని మాత్రం అనిపించింది. అలా నేను ఎంచుకున్న సినిమానే ఈ 'దూసుకెళ్తా'. డాక్టర్‌ అలేఖ్యగా మీ ముందుకుకొస్తున్నాను'' అన్నారు .

  అక్టోబర్ 11న దూసుకెళ్తా...

  అక్టోబర్ 11న దూసుకెళ్తా...


  ఈ సినిమా ఈ నెల 11న విడుదల కాబోతోంది. వీరూ పోట్ల డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం లో మంచు విష్ణు పాత్రకేయుడుగా కనిపిస్తారు. అలాగే డాక్టర్‌ అలేఖ్యగా లావణ్య కనిపిస్తుంది.

  వైవిధ్యమైన పాత్రలు చేయాలని..

  వైవిధ్యమైన పాత్రలు చేయాలని..


  ''నేను చేసే ప్రతి పాత్ర అందరికి నచ్చాలనుకునే తత్త్వం నాది. అలేఖ్య పాత్ర ద్వారా అన్నిరకాల భావాలు పలికించే అవకాశం లభించింది. బ్రహ్మానందంలాంటి వ్యక్తితో వినోద సన్నివేశాల్లో పాలుపంచుకోవడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. దీంతోపాటు నా డ్యాన్స్‌ ప్రతిభని చూపించే అవకాశం కూడా దక్కింది. శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌ల నటన అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటికైనా వారిలా వైవిధ్యమైన పాత్రలు పోషించాలన్నదే నా కోరిక '' అన్నారు లావణ్య త్రిపాఠి.

  దూసుకెళ్తాలో రవితేజ గళం

  దూసుకెళ్తాలో రవితేజ గళం


  ఇక ఈ చిత్రంలో రవితేజ గళం వినిపిస్తుంది. ఇందులో కథానాయకుడి పాత్ర చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాడిగా ఎదిగే నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయట. అవి ఆద్యంతం సరదాగా సాగుతాయట. ఆ సన్నివేశాలకి రవితేజ గళాన్ని అందించారు. విష్ణు, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రమిది.

  వీరు పోట్ల మాట్లాడుతూ..

  వీరు పోట్ల మాట్లాడుతూ..


  వీరు పోట్ల మీడియాతో మాట్లాడుతూ ''రవితేజ గళంతో సాగే సన్నివేశాలు ప్రేక్షకులకి గిలిగింతలు పెట్టేలా ఉంటాయి. సినిమా ప్రారంభంలోనే ఆయన గొంతు వినిపిస్తుంది. ఇందులో విష్ణు పాత్రికేయుడిగా కనిపిస్తారు''అని తెలిపారు.

  విష్ణు మాట్లాడుతూ..

  విష్ణు మాట్లాడుతూ..


  విష్ణు మాట్లాడుతూ ''ఢీ, దేనికైనా రెడీ తరవాత నా కెరీర్‌లో చెప్పుకోదగిన సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. వినోదం, యాక్షన్‌లు కలగలిపిన ఈ చిత్రాన్ని దర్శకుడు తీర్చిదిద్దిన విధానం తప్పకుండా అందరికీ నచ్చుతుంది. సాంకేతికంగానూ ఉన్నత స్థాయిలో ఉంటుంది. మణిశర్మ బాణీలు అదనపు బలం'' అన్నారు.

  నటీనటులు

  నటీనటులు


  బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ఆహుతి ప్రసాద్‌, రావు రమేష్‌, పంకజ్‌ త్రిపాఠీ, రఘుబాబు, సురేఖావాణి, హేమ తదితరులు నటించారు.

  టెక్నీషియన్స్

  టెక్నీషియన్స్


  ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సర్వేష్‌ మురారి, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, సమర్పణ: ఆరియానా, వివియానా.

  సెక్సీ సోయగాలు

  సెక్సీ సోయగాలు


  లావణ్య ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు హాట్ హాట్ ఫోటో షూట్లతో అభిమానులకు కనువిందు చేస్తోంది.

  అందానికి దాసోహం

  అందానికి దాసోహం


  మున్ముందు తెలుగు సినీ అభిమానులంతా ఆమె అందానికి దాసోహం అవడం ఖాయం

  లావణ్య

  లావణ్య


  ఇక ముందే తనలోని అసలైన అందాలు చూస్తారు అనేలా ప్రవర్తిస్తోంది లావణ్య.

  మిస్ ఉత్తరఖండ్

  మిస్ ఉత్తరఖండ్


  ఉత్తర ఖండ్‌కు చెందిన లావణ్య త్రిపాఠి జులై 3, 1989లో జన్మించింది. మిస్ ఉత్తరఖండ్ టైటిల్ 2006లో దక్కించుకుంది.

  Courtesy : Sarika Gangwal

  English summary
  Lavanya Tripathi is an Indian actress. Before starting her acting career, she worked as a model and gained fame after winning the Miss Uttarakhand title in 2006.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more