Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
చేతిలో సినిమాలు లేక.. సరికొత్త ప్లాన్ చేసిన లావణ్య
లావణ్య తిపాఠి.. తెలుగు తక్కువ సినిమాల్లోనే మంచి గుర్తింపును తెచ్చుకున్న నటి. చేసింది కొన్ని సినిమాలే అయినా తన క్యూట్‌నెస్‌తో ఎక్కువ మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడిపిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మాత్రం ఖాళీగా ఉంటోంది. గ్లామరస్ పాత్రలకు రెడీ అన్న సంకేతాలు ఇచ్చినా.. ఆమెకు అవకాశాలు మాత్రం రావడం లేదు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా దర్శనమిస్తోన్న ఈ బ్యూటీ.. అవకాశాలు లేకపోవడంతో సరికొత్త ప్లాన్ చేసిందట.
ప్రస్తుతం ఖాళీగా ఉంటున్న లావణ్య త్రాపాఠి.. ఈ సమయాన్ని సరిగా వాడుకోవాలని చూస్తుందని తెలిసింది. ఇందులో భాగంగానే ఆమె సరికొత్త డ్యాన్స్ ఫామ్‌ను నేర్చుకుంటోందట. బేసిగ్గా క్లాసికల్ డ్యాన్సర్ అయినా ఈ సుందరి.. లాటిన్ డ్యాన్స్ అనే కొత్త ఫామ్‌ను నేర్చకుంటోందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం ఈ సొట్టబుగ్గల సుందరి ముంబైలోనే ఉంటుందని కూడా ప్రచారం జరుగుతోంది. జాబ్, సాల్సా అనే రెండు డ్యాన్స్ ఫామ్‌ల నుంచి వచ్చిందే లాటిన్ డ్యాన్స్. ఇది నేర్చుకోవడం వల్ల ఏమీ ఉపయోగం లేకపోయినా.. తన స్కిల్ మెరుగుపడుతుందని ఆమె ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
లావణ్య త్రిపాఠికి ప్రస్తుతం సినిమాలు లేవు. ఇక, ఆమె తాజాగా నటించిన చిత్రం 'అర్జున్ సురవరం'. నిఖిల్ హీరోగా నటించిన ఈ సినమా విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. మొదట ఈ సినిమాకు 'ముద్ర' అనే టైటిల్ అనుకున్నారు. అయితే, అదే పేరుతో కొద్దిరోజుల క్రితం ఓ సినిమా విడుదలైంది. దీంతో 'అర్జున్ సురవరం' అనే పేరు పెట్టారు. అయితే, ఏదో ఒక కారణంతో ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఇక హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఆశలన్నీ ఈ సినిమా మీదే పెట్టుకుంది. ఆమెకి ఈ సినిమా హిట్ కీలకం. కానీ 'అర్జున్ సురవరం' అసలు విడుదల అవుతుందా అనే సందేహం ఇప్పుడు కలుగుతుంది.