Varun Tej Lavanya Tripathi: నిజమైన పుకార్లు.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌.. పెళ్లి ఎప్పుడంటే?

లావణ్య త్రిపాఠి.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్నా అంటూ క్యూట్ అడిగి తెలుగు ప్రేక్షకులు మనసు దోచుకుంది ఈ చిన్నది. ఇక మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్ ఒకరు.

ఇటీవల ప్లాప్ లు చూసిన వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాఠి కొంతకాలంగా ప్రేమాయణం, డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ పుకార్లే నిజం కాబోతున్నాయి. త్వరలోనే ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు.

Lavanya Tripathi Varun Tej Engagement Date Fixed On June 9

హిట్టు కాని సినిమాలు: మెగా వారసుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠికి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని ఊహగానాలు ఎంతో కాలంగా చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఫంక్షన్ లో లావణ్య కనిపించడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి. ఇక వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి కలిసి విన్నర్, అంతరిక్షం వంటి సినిమాల్లో నటించారు. ఈ సినిమాలు హిట్టు కాలేదు గానీ వీళ్లిద్దరి మధ్య స్నేహం మాత్రం పెరిగింది అని కామెంట్స్ వినిపించాయి.

Lavanya Tripathi Varun Tej Engagement Date Fixed On June 9

రూమర్స్ తగ్గుముఖం: గతంలో వరుణ్ తేజ్ తో డేటింగ్ రూమర్స్ పై నెటిజన్లు అడగ్గా వాళ్లకు స్ట్రాంగ్ ఆన్సర్స్ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. దీంతో ఆ రూమర్స్ కాస్తా తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ మధ్య మరోసారి తెరపైకి ఆ రూమర్స్ వచ్చాయి. లావణ్య త్రిపాఠి చాలా గ్యాప్ తర్వాత ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.

Lavanya Tripathi Varun Tej Engagement Date Fixed On June 9

ప్రమోషన్స్ లో అలా: పులి మేక వెబ్ సిరీస్ లో కిరణ్ ప్రభ అనే పోలీసు అధికారిణిగా అలరించింది. ప్రముఖ ఓటీటీ జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీసుకు మంచి పేరు వచ్చింది. అయితే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో వరుణ్ తేజ్ పై లావణ్య చేసిన కామెంట్స్ ఆ రూమర్స్ కి ఆజ్యం పోశాయి.

Lavanya Tripathi Varun Tej Engagement Date Fixed On June 9

వివాహబంధంతో: అయితే డేటింగ్ వార్తలపై అటు వరుణ్ తేజే కానీ, ఇటు లావణ్య త్రిపాఠి కానీ ఎవరూ స్పందించలేదు. ఆ రూమర్స్ మాత్రం కంటిన్యూ అవుతూ వచ్చాయి. ఇప్పుడు అవే పుకార్లు నిజం కాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహబంధంతో ఒక్కటి కానున్నారని టాక్ వస్తోంది.

Lavanya Tripathi Varun Tej Engagement Date Fixed On June 9

పెళ్లిపై క్లారిటీ: అంతేకాకుండా ఈ నెల అంటే జూన్ 9న వారు ఎంగేజ్ మెంట్ కూడా చేసుకోనున్నట్లు సినీ ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. మెగా ఫ్యామిలీ సభ్యులు, కొంతమంది అతిథుల సమక్షంలోనే ఈ వేడుక జరగనుందట. ఇందుకు ఏర్పాట్లు కూడా మొదలయయ్యాని సమాచారం. ఇక పెళ్లి ఎప్పుడనే విషయంపై క్లారిటీ రాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X