»   » భారీగా పెంచి.. దెబ్బతిన్న లావణ్య త్రిపాఠి...అసలేం జరిగిందంటే...

భారీగా పెంచి.. దెబ్బతిన్న లావణ్య త్రిపాఠి...అసలేం జరిగిందంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

భలే భలే మొగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా చిత్రాలతో గ్లామర్ డాల్ లావణ్య త్రిపాఠి దూసుకుపోతున్నది. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు ఆమెకు నిరాశను కలిగించాయి. అయితే తాజాగా అక్కినేని నాగ చైతన్యతో జతకట్టి మరోసారి టాలీవుడ్ లో తన ఫేట్ ను పరిక్షించుకోనున్నది. అయితే కొన్ని కారణాల వల్ల గీతాఆర్ట్స్ మూవీ నుంచి లావణ్య త్రిపాఠి తప్పుకోవడంతో రష్మిక మండన్నా ఆ ఛాన్సు దక్కింది. లావణ్య త్రిపాఠి ఎందుకు తప్పుకున్నదనే విషయంపై అనేక కథనాలు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతున్నాయి.

తప్పుకొన్నదని.. తప్పించారని

తప్పుకొన్నదని.. తప్పించారని

యుద్ధం శరణం చిత్రం తర్వాత లావణ్య త్రిపాఠి చేతిలో ఉన్నది ఒక్కటే జీవితం చిత్రం ఉంది. కానీ ఓ సెన్సెన్షనల్ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. లావణ్య తప్పుకొన్నదని కొందరు అంటుండగా, ఆమెను తప్పించారని మరికొందరు పేర్కొంటున్నారు.

లావణ్య వైదొలగడాన్ని

లావణ్య వైదొలగడాన్ని

అర్జున్ రెడ్డి లాంటి సెస్సెన్షల్ హిట్ ను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ చిత్రంలో ఆమె నటించాల్సి ఉంది. అయితే ఈ చిత్రం నుంచి లావణ్య వైదొలగడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.

రెమ్యునరేషన్ ను భారీగా

రెమ్యునరేషన్ ను భారీగా

విజయ్ దేవరకొండ చిత్రం వదులుకోవడానికి ప్రధాన కారణం రెమ్యునరేషన్ అని తెలుస్తున్నది. చేతిలో విజయాలు లేకపోయినా లావణ్య రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసిందట. దీంతో ఆమెను తప్పించారనే ప్రచారం జరుగుతున్నది.

కన్నడ నటి రష్మిక మందన్న

కన్నడ నటి రష్మిక మందన్న

భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన నేపథ్యంలో లావణ్యను తప్పించి ఆమె స్థానంలో కన్నడ నటి రష్మిక మందన్నను తీసుకున్నారు. విజయ్ దేవరకొండతో చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్నది. ఈ చిత్రానికి పరశురాం దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

    English summary
    Lavanya Tripathi rejected the offer of Vijay Devarakonda's upcoming movie. It is not a small matter that a star heroine exited the movie which is bankrolling by the well-known banner Geeta Arts. Vijay Devarakonda and Lavanya Tripathi were going to do the film under the director of Srirastu Shubhamastu fame Parasuram. The news stated that even though Lavanya liked the story because of some personal reasons the actress willingly went to the makers and exited from the project.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu