»   » సస్పెన్స్ థ్రిల్లర్‌గా లవ్ అండ్ వార్ (లా)

సస్పెన్స్ థ్రిల్లర్‌గా లవ్ అండ్ వార్ (లా)

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    సమాజంలో ప్రతి మనిషి కి చట్టం, న్యాయానికి లోబడే జీవించాలి. అలా జీవిచడం లేదంటే జరిగే మలుపులు ఎలా ఉంటాయి అనే కథాంశంతో రూపొందిన మూవి 'లా'.. ''లవ్ అండ్ వార్'' అనేది ఉపశీర్షిక. పూర్తి స్థాయి క్రైం మరియు సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ షూటింగంతా కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్.

    హీరో కమల్ కామరాజ్ మాట్లాడుతూ
    'హీరోగా కమ్ బ్యాక్ మూవీ అనగానే చాలా ఆలోచించాను. కానీ దర్శకుడు గగన్ గోపాల్ చాలా డిటైల్డ్ గా కథ చెప్పాడు. అతను కథను చెప్పిన తీరే నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. ఇది పూర్తి స్థాయి క్రైం థ్రిల్లర్ . కొన్ని ట్విస్ట్ లు ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తాయి. 'లా' అనే టైటిల్ కూడా కథలోంచే వచ్చింది. సినిమా కథనం చాలా సీరియస్ గా సాగుతుంది. ఈ టైటిల్ అనగానే చాలా ఎగ్జైట్ అయ్యాను మన జీవితాల్లో బాగా వినిపించే పదం కాబట్టి ఈజీగా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారనిపించింది. ఈ సినిమాను విజయవాడలో ఎక్కువ బాగం షూట్ చేసాము. అదే చాలా ప్రెష్ ఫీల్ ను తెచ్చింది. ఇందులో ఒక టఫ్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను. సినిమా బాగా వచ్చింది. నిర్మాతలు శివ, రమేష్ లు కొత్త వారైనా డైరెక్టర్ కి టీం కి చాలా బాగా సపోర్ట్ చేసారు.' అన్నారు.

    Law movie: Kamal Kamarajs Spy Thriller

    మౌర్యాణి మాట్లాడుతూ
    'తెలుగు లో నేను చేస్తున్న ఏడో సినిమా ఇది. దర్శకుడు కథ చెప్పినప్పుడే చాలా డిటైల్డ్ గా నా క్యారెక్టర్ ని చెప్పారు. ఫెర్ఫార్మెన్స్ కి బాగా స్కోప్ వున్న పాత్ర కు నన్ను అప్రోచ్ అవ్వడం నాకు ఆనందం కలిగింది. తెలుగు లో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. సినిమా పై నాకు పూర్తి నమ్మకం ఉంది. చాలా మంచి వాతావరణంలో సినిమా షూటింగ్ జరిగింది. సినిమాటోగ్రఫర్ అమర్ కుమార్ అందించిన సహాకారం ఎప్పటికీ మరిచిపోను. ప్రొడ్యూసర్స్ కి, దర్శకుడు గగన్ గోపాల్ కి థ్యాంక్స్ . కమల్ గారితో వర్క్ చేయడం ఇదే మొదటిసారి అయినా చాలా కో ఆపరేటివ్ గా ఉన్నారు. ఏదో తెలియని విషయం తెలుస్తూ ఉంటుంది కమల్ కామరాజు గారితో మాట్లాడుతుంటే.. ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది' అన్నారు.

    Law movie: Kamal Kamarajs Spy Thriller

    దర్శకుడు గగన్ గోపాల్ ముల్క మాట్లాడుతూ
    ' మంచి ట్వస్ట్ లతో ఆద్యంతం ఉత్కంఠత రేపెత్తే కథనాలతో 'లా' ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం. నా మీద నమ్మకంతో ఈ కథ ఇంత బాగా రావడానికి నిర్మాతలు అందించిన సపోర్ట్ కి థ్యాంక్స్. సత్య కశ్యప్ అందించిన మ్యూజిక్ ఈ సినిమా కి ప్రధానం బలంగా మారింది. అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయినా నిర్మాతలు సినిమా పై, నాపై నమ్మకంతో మాకు సపోర్ట్ గా నిలిచారు..సహాకరించిన టీం అందరికీ ధన్యవాదాలు' అన్నారు.

    ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న 'లా' మూవీ త్వరలో విడుదలకు సిద్దం అవుతుంది. పూజా రామచంద్రన్, మంజుభార్గవి, ఛత్రపతి శేఖర్ , రవి మల్లాడి కీలక పాత్రలు పోషించారు.

    English summary
    Kamal Kamaraj and Pooja Ram Chandran's latest movie Law. This movie directed by Gagan Gopal Mulka. Film first look was released by film unit recently.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more