'3 ఇడియేట్స్' తో చేరుతున్న లారెన్స్..
హిందీలో వచ్చిన '3 ఇడియేట్స్' సినిమాని శంకర్ తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తమిళ్ లో దీనికి 'నన్బన్' అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసారు. ఈ చిత్రం తొలి షెడ్యులు షూటింగ్ ఇటీవలే ఊటీలో పూర్తయింది. ఇలియానా, జీవా, శ్రీకాంత్ (శ్రీరాం) లపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. తమిళ వెర్షన్ లో విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, యస్.జె.సూర్య కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇదిలా ఉంచితే, తాజాగా ప్రముఖ నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ కూడా ఈ టీమ్ లో చేరుతున్నాడు. హిందీ వెర్షన్ లో జావేద్ జాఫ్రీ పోషించిన పాత్రను లారెన్స్ ఇందులో పోషిస్తాడు. కోటీశ్వరుడి కొడుకుగా కామెడీ పండించే క్యారెక్టర్ ఇది. తదుపరి షెడ్యూలు షూటింగ్ త్వరలో డెహ్రాడున్ లో మొదలవుతుంది. ఒరిజినల్ వెర్షన్ కి శంకర్ చాలా మార్పులు చేసినట్టు తెలుస్తోంది. జెమినీ ఫిలిం సర్కుట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications











