లారెన్స్ హీరోగా ఆనందీ క్రియేషన్స్ చిత్రం
నృత్యదర్శకుడు లారెన్స్ దర్శకుడిగానే గాక హీరోగా కూడా బిజీ అవుతున్నాడు. నాగార్జున తదుపరి సినిమా డాన్ ఆయన దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. గతంలో నువ్వు నేను, ఎవరే అతగాడు, ఒకరికి ఒకరు సినిమాలను నిర్మించిన ఆనందీ క్రియేషన్స్ సంస్ధ లారెన్స్ హీరోగా ఒక సినిమా నిర్మించనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం కె.బాలచందర్ పొయ్ ని తెలుగులో అబద్ధంగా ఈ సంస్ధే అనువాదం చేస్తోంది. లారెన్స్ దర్శకత్వం వహించిన స్టైల్ చిత్రం మార్చి నాలుగో తేదీతో యాభై రోజులు పూర్తి చేసుకుంది.


Click it and Unblock the Notifications