దాసరి క్లాప్, లారెన్స్ ‘ముని-3’ షురూ(ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: రాఘవ లారెన్స్ దర్శకుడిగా, హీరోగా... ముని-3 చిత్రం ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో దర్శకరత్న దాసరి నారాయణరావు తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కెమెరా స్విచాన్ చేయగా, దర్శకురాలు నందినీరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ చిత్రంలో లారెన్స్ సరసన తాప్సీ కథానాయికగా చేస్తోంది. శ్రీ గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై మల్టీ డైమన్షనల్ అధినేత రజిత్ పార్థసారథి సమర్పణలో నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... 'కాంచన' సినిమా సమయంలోనే తన బ్యానర్ లో ఓ సినిమా చేసిపెడతానని లారెన్స్ తనకి మాట ఇచ్చారనీ, దానిని ఇప్పుడిలా నిలబెట్టుకున్నారని చెప్పారు. 'కాంచన' సినిమా తనకి మంచి లాభాలు తెచ్చి పెట్టిందనీ, అలాగే ఈ సినిమా కూడా ఆ స్థాయి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకముందని అన్నారు.

దర్శకుడు లారెన్స్ మాట్లాడుతూ.... ఈ చిత్రం కాంచన తరహాలోనే ఎంటర్‌టైన్ చేస్తుందని, ఓ వైపు నవ్విస్తూనే... భయపెడుతుందని చెప్పుకొచ్చారు. జనవరి 15 నుంచి ఈచిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని వెల్లడించారు. లారెన్స్, తాప్సీ, బ్రహ్మానందం, శ్రీమాన్, అలీ, కోవై సరళ నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం విజయ్ ఆంటోని, సినిమాటోగ్రఫీ: కృష్ణ స్వామి, నిర్మాత: బెల్లంకొండ సురేష్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాఘవ లారెన్స్.

దాసరి క్లాప్, లారెన్స్ ‘ముని-3’ షురూ(ఫోటోలు)

క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభిస్తున్న దాసరి నారాయణరావు.

దాసరి క్లాప్, లారెన్స్ ‘ముని-3’ షురూ(ఫోటోలు)

దాసరితో లారెన్స్ చాలా క్లోజ్ గా...

దాసరి క్లాప్, లారెన్స్ ‘ముని-3’ షురూ(ఫోటోలు)

తొలి సీన్లో లారెన్స్, తాప్సి

దాసరి క్లాప్, లారెన్స్ ‘ముని-3’ షురూ(ఫోటోలు)

ప్రముఖులతో ముని-3 టీం

దాసరి క్లాప్, లారెన్స్ ‘ముని-3’ షురూ(ఫోటోలు)

ముని-3 ఫస్ట్ లుక్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X