మొత్తానికి సునీల్ ని వలేసి పట్టాడు
లారెన్స్ కి మాస్ వంటి హిట్ ఇచ్చినా తెలుగు హీరోలెవరూ అతన్ని దగ్గరకి రానివ్వలేదు. తమిళ అతి ఎక్కువగా చేస్తూంటాడని, అతనే హీరోలా ఎక్సపోజ్ అవుతూంటాడని అతన్ని ప్రక్కన పెడుతూ వస్తున్నారు. అయితే రీసెంట్ గా ప్రభాస్ ఒప్పించి రెబెల్ చిత్రం చేస్తున్న లారెన్స్ తన నెక్స్ట్ చిత్రం ఎవరితో చేయాలా అనే సందేహం బయిలుదేరింది. ఆ క్రమంలో నాగచైతన్యకో కథ వినిపించి నాగార్జున చేత కాదనిపించుకున్నాడు. దాంతో ఇప్పుడు సునీల్ కి ఎర వేసాడు.
సునీల్ డాన్స్ లలో కూడా మంచి ప్రావీణ్యమున్నవాడు కావటంతో అతనితో సినిమా చేయాలని నిర్ణయించుకుని కామిడీ, యాక్షన్ కలిపిన కథ వినిపించి ఓకే చేయించుకున్నాడు. సునీల్ కూడా అప్పల రాజు తర్వాత డైలమోలో ఉన్నాడు. ప్రస్తుతం బ్లేడ్ బాబ్జి దర్సకుడు దేవిప్రసాద్ దర్సకత్వంలో తను వెడ్స్ మను చిత్రం కమిటయ్యాడు.ఇక రెబెల్ పూర్తవగానే లారెన్స్ ఈ చిత్రం ప్రారంభించే అవకాశం ఉంది. ఇక లారెన్స్ తాజా చిత్రం కూడా సునీల్ చూసేసి బాగుందని పొగిడేయటం కూడా ఈ కొత్త ఒప్పందం ఎఫెక్టే అంటున్నారు.


Click it and Unblock the Notifications











