మరో ‘కాంచన’ కిలారెన్స్ సిద్దం..మునీ సీక్వెల్ తపస్సు..
ముని చిత్రాన్ని లారెన్స్ వదిలేట్టు లేరు. ఆయన దర్శకత్వం వహించిన ముని చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా సీక్వెల్ గా 'కాంచన"ను తెరకెక్కించారు. తమిళం, తెలుగు భాషల్లో అది ఘనవిజయం సాధించడంతో అమితానందంలో ఉన్నారు. ఈ చిత్రాన్ని హిందీలోనూ రూపొందించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. దీని గురించి ఆయన తెలుపుతూ కాంచన చిత్రానికి విశేష ప్రజాదరణ లభించిందన్నారు. దీన్ని హిందీలోకి రీమేక్ చేసే విషయంపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తన పాత్రను హిందీలో సల్మాన్ ఖాన్ పోషించనున్నట్టు వెల్లడించారు. శరత్ కుమార్ పాత్రకు సంజయ్ దత్ ను సంప్రదిస్తున్నట్టు చెప్పారు. ఆ తరువాత ముని మూడో భాగాన్ని తెరకెక్కిస్తానని లారెన్స్ వెల్లడించారు.
హీరో, దర్శకుడు లారెన్స్ మాట్లాడుతూ, తాముపడ్డ కష్టానికి తగిన ఫలితం లభించిందని అన్నారు. లోగడ ఒక హిజ్రా ఏడ్చి తన గురించి చెప్పుకున్నాడు. అప్పుడే సినిమాగా తీయాలనిపించిందని అన్నారు లారెన్స్, దానికి తగ్గ ఫలితమే కాంచన . ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో 'రెబల్" చిత్రం షూటింగ్ లో బీజీగున్నాన్నారు. అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ పూర్తవగానే కాంచన రీమేక్ ని హిందీలో చిత్రీకరించనున్నామని లారెన్స్ తెలిపారు. దీని తర్వాత ముని పార్ట్ 3 ప్రారంభిస్తామని తెలపారు.


Click it and Unblock the Notifications











