సుశాంత్ మరణం వెనుక గుట్టు రట్టు.. సంచలనం రేపుతున్న లాయర్ ట్వీట్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వెనుక అసలు కారణం ఇదే అంటూ ఆయన కుటుంబ తరుఫున కేసు వాదిస్తున్న లాయర్ వికాస్ సంచలన రీతిలో ట్వీట్ చేశారు. సుశాంత్ సింగ్‌ది సూసైడ్ కాదు.. హత్యే అంటూ మరోసారి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. సుశాంత్ గొంతు నులమడం వల్లే మరణించారనే విషయాన్ని ట్వీట్‌లో ధ‌‌‌ృవీకరించారు. వికాస్ సింగ్ చేసిన ట్వీట్‌లో...

ఎయిమ్స్‌కు పోస్ట్ మార్టమ్ నివేదికలు

ఎయిమ్స్‌కు పోస్ట్ మార్టమ్ నివేదికలు

సుశాంత్ సింగ్ మరణం తర్వాత కూపర్ హాస్పిటల్ నిర్వహించిన పోస్ట్‌మార్టమ్ వివాదాస్పదమైంది. కూపర్ హాస్పిటల్ అందించిన రిపోర్ట్ తప్పుల తడక అంటూ కొందరు బహిరంగంగానే ఆరోపణలు చేశారు. అయితే సుశాంత్ సింగ్ కేసు దర్యాప్తును ముంబై పోలీసులు చేపట్టిన తర్వాత పోస్ట్ మార్టమ్ రిపోర్టు, ఫోటోలను పరిశీలించాలని, వీలైతే పోస్టుమార్టమ్ రిపోర్టును మళ్లీ ఇవ్వాలని ఎయిమ్స్‌కు అధికారులు సూచించారు.

 సీబీఐ దర్యాప్తు తీరుపై అసంతృప్తి

సీబీఐ దర్యాప్తు తీరుపై అసంతృప్తి

తాజాగా సుశాంత్ కేసు విషయంలో సీబీఐ అనుసరిస్తున్న తీరుపై లాయర్ వికాస్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కేసును సూసైడ్ నుంచి మర్డర్‌కు మార్చాలని అన్నారు. సుశాంత్ కేసు దర్యాప్తులో జరుగుతున్న తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎయిమ్స్ డాక్టర్లు సుశాంత్‌ది సూసైడ్ కాదని ధృవీకరించారని, వారు ఫోరెన్సిక్ రిపోర్టుపై కసరత్తు చేస్తున్నారని అన్నారు.

సుశాంత్‌ది సూసైడ్ కాదు.. మర్డర్

సుశాంత్‌ది సూసైడ్ కాదు.. మర్డర్

సుశాంత్ దర్యాప్తు గురించి లాయర్ వికాస్ సింగ్ ట్వీట్ చేస్తూ.. సుశాంత్‌ది సూసైడ్ కాదు.. మర్డర్ అనే విషయంపై సీబీఐ నిర్ణయం తీసుకోవడంపై అనుసరిస్తున్న విధానంతో ప్రస్టేషన్ పెరిగిపోతుంది. చాలా కాలం క్రితం సుశాంత్ మృతదేహానికి సంబంధించిన ఫోటోలు చూసి ఎయిమ్స్ డాక్టర్లు 200 శాతం సుశాంత్‌ది హత్యే, గొంతు నులమడం వల్ల మరణించారని చెప్పారు అని పేర్కొన్నారు.

సుశాంత్ మరణంపై అనేక అనుమానాలు

సుశాంత్ మరణంపై అనేక అనుమానాలు

ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో సుశాంత్ మరణంపై పలువురు రాజకీయ నేతలు, ఎంపీ సుబ్రమణ్యస్వామి, నటులు శేఖర్ సుమన్, రూపా గంగూలి తదితరులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇలాంటి నేపథ్యంలో త్వరలోనే ఎయిమ్స్ డాక్టర్లతో సీబీఐ అధికారులు సమావేశమై చర్చించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X