బాలయ్యకు ఆ ధైర్యమే లేదు.. అంతకంటే ఇంకేం చూపిస్తాడు.. లక్ష్మీపార్వతి ఘాటు వ్యాఖ్యలు!

Recommended Video

Laxmi Parvathi Sensational Comments On Balakrishna | Filmibeat Telugu

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. రెండవ భాగమైన ఎన్టీఆర్ మహానాయకుడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. పార్టీ స్థాపించిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం, దేశ రాజకీయాలని సైతం మలుపు తిప్పేలా అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం లాంటి విశేషాలని ఎన్టీఆర్ మహానాయకుడులో చూపించారు. కానీ లక్ష్మీపార్వతి ప్రస్తావన మాత్రం ఎక్కడా లేదు. తాజాగా లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం గురించి స్పందించారు.

 చంద్రబాబు గొప్పతనం

చంద్రబాబు గొప్పతనం

లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం గురించి మాట్లాడుతూ.. నేను సినిమా చూడలేదు. కానీ టాక్ తెలుస్తోంది. ఇది ఎన్టీఆర్ బయోపిక్ లాగా లేదని అందరూ అంటున్నట్లు లక్ష్మీపార్వతి అన్నారు. సినిమా మొత్తం చంద్రబాబు గొప్పతనమే చూపించారని అంటున్నారు. దీని గురించి నేను ముందే చెప్పా. ఇంతకంటే గొప్పగా ఏమి ఉందని నాకు ముందే తెలుసు అని అన్నారు.

బాలయ్యకు ఆ ధైర్యమే లేదు

బాలయ్యకు ఆ ధైర్యమే లేదు

ఎన్టీఆర్ బయోపిక్ లో వాస్తవాలు చూపించలేరు. బాలయ్యకు ఆ ధైర్యమే లేదు. బాలయ్య చంద్రబాబు ఇద్దరూ వియ్యంకులు. బాలకృష్ణ అదే పార్టీలో ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నాడు. ఇక వీరిద్దరి మధ్య వైస్రాయ్ హోటల్ ఒప్పందం ఎలాగూ ఉంది అని లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో ఇన్ని లింకులు పెట్టుకున్న బాలయ్య తండ్రికి జరిగిన ద్రోహాన్ని ఎలా చూపిస్తాడు అని లక్ష్మీపార్వతి అన్నారు.

అందుకే నా ప్రస్తావన లేదు

అందుకే నా ప్రస్తావన లేదు

ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా తెరకెక్కించినా ఎక్కడా నా ప్రస్తావన లేదు. నన్ను చూపిస్తే ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయాన్ని కూడా చూపించాలి. అందువల్లనే నన్ను చూపించే ధైర్యం వాళ్లకు లేదు అని లక్ష్మీపార్వతి అన్నారు. వాస్తవాలు లేవు కాబట్టే ప్రజలు కూడా సరైన తీర్పే ఇస్తున్నారని లక్ష్మి పార్వతి ఎద్దేవా చేశారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్

లక్ష్మీస్ ఎన్టీఆర్

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం గురించి నా కంటే ఆర్జీవినే బాగా చెబుతారు అని అన్నారు. మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, ఎన్టీఆర్ చివరిరోజుల్లో అనుభవించిన మానసిక వేదని రాంగోపాల్ వర్మ వాస్తవికతతో చూపించబోతున్నారు. ట్రైలర్ కే దాదాపుగా కోటి వ్యూస్ వచ్చాయని లక్ష్మీపార్వతి అన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం నేను కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆమె తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X