Unstoppable 2: బాలకృష్ణ ఎన్టీఆర్ కొడుకేనా.. అతన్ని చూస్తే కంపరంగా ఉంది.. లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్

నందమూరి నటసింహం మొదటిసారిగా హోస్ట్ చేసి సూపర్ సక్సెస్ అయిన షో అన్‌స్టాపబుల్. ఈ షో ఫస్ట్ సీజన్ ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా ప్రసారమైన ఈ షోలో హోస్ట్ గా బాలకృష్మ అదరగొట్టాడు. దీంతో ఈ షోకి రెండో సీజన్ ను ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. అన్‌స్టాపబుల్ షో 2 సీజన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ షోలో బాలకృష్ణ, చంద్రబాబు రాజకీయం గురించి 1995లో జరిగిన ఎన్నికల అంశాలపై చర్చించారు. ఈ మాటలపై తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. చంద్రబాబు, బాలకృష్ణ తీరుపై విమర్శలు గుప్పించారు.

బాలకృష్ణ, చంద్రబాబు మాట్లాడిన తీరుపై..

బాలకృష్ణ, చంద్రబాబు మాట్లాడిన తీరుపై..

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో 2వ సీజన్ కు మఖ్య అతిథిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ లో దివంగత, సీనియర్ ఎన్టీఆర్ గురించి బాలకృష్ణ, చంద్రబాబు మాట్లాడిన తీరుపై తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. 1995 ఎన్నికల ముందు నుంచే చంద్రబాబు కుట్రలు, కుయుక్తులు ప్రారంభించారని ఆమె ఆరోపించారు.

తెలుగు దేశం ఓడిపోతుందని..

తెలుగు దేశం ఓడిపోతుందని..

1995లో జరిగిన పరిణామాలపై చంద్రబాబు మొదటి సారి స్పందించారు. ఎన్టీఆర్ కాళ్లు చంద్రబాబు పట్టుకున్నానడం అబద్ధం. 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలకు చంద్రబాబు డబ్బులు ఇచ్చినట్లుగా అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ నాతో చెప్పారు. వేరే పార్టీ పెట్టడానికి చంద్రబాబు, దాసరి నారాయణ రావు, చిరంజీవి కలిశారు. తెలుగు దేశం ఓడిపోతుందని కూడా చంద్రబాబు అప్పుడు ప్రచారం చేయించారు. మా పెళ్లితో కూడా పార్టీ ఓడిపోతుందని చంద్రబాబు చెప్పించారు.

 ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి రోడ్డు మీదకు..

ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి రోడ్డు మీదకు..

చంద్రబాబు అధికార దాహమే ఎన్టీఆర్ ను చంపేసింది. తానే అధికారం తీసుకోవాలనే లక్ష్యంగా ఎన్నికలకు ముందే బాబు కుట్ర చేశారు. నిజంగా పార్టీలో నేను ఇబ్బంది పెట్టి ఉంటే ఎన్టీఆర్ ఎందుకు భరిస్తారు. నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో ఎన్టీఆర్ నాకు ఇష్టమైన వారికి సీట్లు ఇచ్చారు. ఆ అక్కసుతోనే చంద్రబాబు కొంతమంది ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి రోడ్డు మీదకు తీసుకొచ్చారు.

ఇద్దరు వెన్నుపోటుదారులు..

ఇద్దరు వెన్నుపోటుదారులు..

ఆ తర్వాత డిసిప్లేనరీ యాక్షన్ కింద ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలను ఎన్టీఆర్ సస్పెండ్ చేశారు. 20 మందని సస్పెండ్ చేశారని చెప్పింది అబద్ధం. ఇద్దరు వెన్నుపోటుదారులు ఒకరినొకరు సమర్ధించుకున్నట్లు ఉంది ఆ షో. చంద్రబాబు ఓ దుర్మార్గుడు. ఇప్పటికీ నిజం చెప్పాలన్న మానవత్వం లేదు. బాలయ్య మీద మొదటిసారి పరమ అసహ్యం వేస్తోంది.

 ఆయన ఎన్టీఆర్ కొడుకేనా..

ఆయన ఎన్టీఆర్ కొడుకేనా..

ఆయన ఎన్టీఆర్ కొడుకేనా అన్నంతగా జుగుప్సా కలుగుతోంది. ఇలాంటి కొడుకులు ఉంటారా అనిపించింది. ఇప్పటివరకు బాలకృష్ణను బాగా అభిమానించేదాన్ని. చాలా ఇష్టపడ్డాను. చాలా సాయం చేశాను. ఇప్పుడు ఇద్దరి మాటలు చూస్తుంటే కంపరంగా ఉంది. బావను కాపాడటానికి బావమరిది రంగంలోకి దిగాడు. ఎన్నికలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో నిజాలు మొత్తం తెలుస్తున్నాయి.

హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు..

హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు..

కాగా ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ 2 ప్రారంభ ఎపిసోడ్ లో చంద్రబాబు సందడి చేశారు. అలాగే స్పెషల్ అట్రాక్షన్ ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా హాజరయ్యాడు. చంద్రబాబు కుటుంబం, రాజకీయాలు, హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వరకు అనేక అంశాలపై ఆసక్తికరంగా మాట్లాడారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X