మంచు లక్ష్మీ ప్రసన్న కూడా మొదలెట్టేసింది
మంచు లక్ష్మీ ప్రసన్న తన తాజా చిత్రం 'డిపార్ట్‌మెంట్"గురించి పబ్లిసిటీ స్టార్ట్ చేసేసింది.అసలే రామ్ గోపాల్ వర్మ ఓ రేంజి పబ్లిసిటీ ఇచ్చి జనాల్ని ఊదరకొడతాడు అనుకుంటే ఈలోగా లక్ష్మీ కూడా ఈ సినిమా గురించి స్టేట్ మెంట్స్ ఇవ్వటం ప్రారంభించింది.ఆమె డిపార్టమెంట్ గురించి చెపుతూ.. రాము డెరైక్షన్‌లో సంజయ్‌దత్ సరసన నటించడం చాలా ఆనందంగా ఉంది.నాకు ఇచ్చిన పాత్రకు నేను పూర్తి న్యాయం చేశానని అనుకుంటున్నాను.నా కేరక్టరుకు ఎవరు డబ్బింగ్ చెబితే బావుంటుందా అని ఆలోచించి నాకు తోచిన కొన్ని పేర్లు లిస్టు రాసి పెట్టుకున్నాను. అయితే మా డెరైక్టర్ రామ్‌గోపాల్‌వర్మగారు అలా వద్దని వారించి, నా చేతనే డబ్బింగ్ చెప్పిస్తానని చెప్పారు.
ఆ రకంగా నేను రాసుకున్న ఆ లిస్టుని పక్కన పెట్టమన్నారు వర్మ. సో... ఇప్పుడు నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకోబోతున్నాను. ఎక్కడా నా మాటల్లో 'యాస"కు తావులేకుండా, పర్‌ఫెక్ట్‌గా హిందీలో డైలాగ్స్ చెప్పాలనుకుంటున్నాను. రేపు మీరు సినిమా చూసి అభిప్రాయం చెప్పండి అంది.అమితాబ్‌బచ్చన్, సంజయ్‌దత్, బిపాసాబసు, లక్ష్మీప్రసన్న, రానా తదితరులు నటించిన ఈ చిత్రంలో ఆమె సంజయ్ దత్ కి భార్యగా కనిపించనుంది.ఈ చిత్రం పిభ్రవరిలో రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











