తన రాజకీయ ప్రవేశం పై...మంచు లక్ష్మీ ప్రసన్న

By Srikanya

లక్ష్మీ టాక్ షో ద్వారా పాపులర్ అయిన మంచు లక్ష్మీ ప్రసన్న (మోహన్ బాబు కుమార్తె) రాజకీయాల్లోకి రానుందా అని ఈ మధ్య అందరికీ సందేహం కలుగుతోంది. వాటిని తీర్చటానికా అన్నట్లు లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ...నాకు లోక్ సత్తా ఐడియాలజీ నచ్చుతుంది. అలాగే ఎన్టీఆర్, వైయస్సార్ విజనరీ ఇష్టపడతాను. అలాగే కేవలం మహిళా రిజర్వేషన్ బిల్ ని ఎడ్వాంటేజ్ గా తీసుకుని రాజకీయాల్లోకి దూకను. నాకు రాజకీయాల్లోకి రావాలనిపిస్తే నూరు శాతం ఇంట్రస్టుతో వచ్చి నూటికి నూటయాభై పాళ్ళు న్యాయం చేయటానికి ప్రయత్నిస్తా.

కానీ ఇప్పుడు నా దృష్టి పూర్తిగా సినిమాలపైనే ఉంది. మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్. ఆయన ఎప్పుడూ బాగా చదువుకుని మా విద్యా సంస్ధలు భాధ్యతలు తీసుకోమంటూంటారు. కానీ సినిమాలనేవి నా జీవితంలో ఓ భాగంగా మారిపోయాయి. నేను ధియోటర్ ఆట్స్ డిగ్రీ తీసుకున్నాను. అలాగే కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ నుంచి స్క్రిప్టు రైటింగ్ లో గ్యాడుయేషన్ పూర్తి చేసాను అంటోంది. ఇక ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న...సిద్దార్ధ చేస్తున్న ఫాంటసీ చిత్రంలో విలన్ గా చేస్తోంది. అలాగే కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తన సోదరుడు మంచు మనోజ్ హీరోగా ఝుమ్మంది నాదం చిత్రం నిర్మిస్తోంది. అలాగే త్వరలో మళ్లీ 'లక్ష్మీ టాక్‌ షో' మొదలుపెట్టబోతున్నాను. ఈసారి చిరంజీవి అంకుల్‌తో ఆ షో మొదలుపెట్టాలని ఉంది అంటూ రీసెంట్ గా ఝుమ్మంది నాదం ఆడియో పంక్షన్ లో చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X