లక్ష్మీ ప్రసన్నలో ఆ బాలీవుడ్ హీరోయిన్ పోలికలున్నాయా?
మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్నకీ దీపికా పడుకోనికీ బాగా దగ్గర పోలికలున్నాయంటూ ముంబయికి చెందిన మిడ్ డే పత్రిక ఓ ఆర్టికల్ ప్రచురించింది. ఆమె రీసెంట్ గా చేసుకుని విడుదల చేసిన ఫోటో షూట్ ని చూసి ఈ పోలిక తీసుకొచ్చింది. అలాగే ఆమె లాస్ ఏంజిల్స్ కీ ఇండియాకి షెటిల్ చేస్తూంటుందని, ఆమె లాస్ వేగాస్, బోస్టన్ లీగల్, డెస్పరేట్ హౌస్ వైవ్స్ అనే షో లలో కనిపించే గొప్ప వ్యక్తి అని రాసుకొచ్చింది. అంతేగాక ఆమె ఝుమ్మందినాదం అనే చిత్రం నిర్మాతగా సక్సెస్ ని సాధించిందని చెప్పుకొచ్చింది. అంతేగాక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డిస్నీ సంస్ధ నిర్మించే తెలుగు చిత్రం వన్స్ అపాన్ ఎ టియర్ డ్రాప్ అనే చిత్రంలో నెగిటివ్ రోల్ చేస్తోందినీ చెప్పారు.
అలాగే త్వరలోనే లక్ష్మీ టాక్ షో మళ్ళీ మొదలెడుతోందని మనకూ తెలిసిన విషయాలనే అందులో రాసుకొచ్చింది. ఇక లక్ష్మీ ప్రసన్నకామెంట్ కూడా తీసుకుని ప్రచురించారు. ఆమె మాట్లాడుతూ..తాను అమెరికాలో ఉన్నప్పుడు చాలా బాలీవుడ్ చిత్రాలు చూసేదాన్నని, అలాగే తనకు ప్రస్తుతం బాలీవుడ్ ఆఫర్స్ కొన్ని వస్తున్నాయని, కొన్ని స్క్రిప్టులు పరిశీలిస్తున్నాని, నిజంగా ఛాలెంజ్ ఉండే రోల్ దొరికితే చేస్తానని ఆమె స్టెట్ మెంట్ ఇచ్చింది. అంటే ఈ కథన సారాంశం..లక్ష్మీ ప్రసన్న కన్ను బాలీవుడ్ పై పడిందని, అక్కడ ఆఫర్స్ కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని..గుడ్. బెస్టాఫ్ లక్.


Click it and Unblock the Notifications











