మేం మా పనులు చేసుకోవాలా? వద్దా...లక్ష్మీ ప్రసన్న మండిపాటు
ఓ వెబ్‌సైట్‌తో పొత్తు పెట్టుకుని దాదాపు 200 వెబ్‌సైట్ల నుంచి పైరసీని ఆపుతున్నాం. మేం మా పనులు చేసుకోవాలా? దొంగల వెనుక పడాలా? అర్థం కావట్లేదు అంటూ వాపోతోంది మంచు లక్ష్మీ ప్రసన్న. ఆమె తొలిసారి నిర్మాతగా మారి నిర్మించిన 'ఝుమ్మంది నాదం' చిత్రం పైరసీ సీడీలు లక్ష వరకు మంగళవారం విజయవాడలో లభించాయి. ఈ విషయానికి సంబంధించి లక్ష్మీప్రసన్న మీడియాతో సమావేశమయ్యామై పై విధంగా స్పందించారు. అలాగే..."ఝుమ్మంది నాదం చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్న తీరు బాగుంది. మంచి సినిమా చేశామని ఆనందంగా ఉంది. ఆ ఆనందాన్ని ఆస్వాదించేలోపు పైరసీ సీడీలు వచ్చాయని తెలిసి ఆందోళనగా ఉంది.
దయచేసి ఎవరూ పైరసీ సీడీలను కొనవద్దు. మా సంస్థ నిజమైన విజయాన్ని చూసి ఐదేళ్ళయింది. పైరసీని కొనకండి. అదే మాకు మీరు వంద కోట్లు ఇచ్చినట్టు" అని ఆమె అంటోంది. ఇక సీనియర్ దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మనోజ్, తాప్సీ జంటగా రూపొందిన చిత్రం 'ఝుమ్మంది నాదం'. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై తొలిసారి నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించారు లక్ష్మీప్రసన్న. ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











