లక్ష్మీస్ వీరగ్రంథం.. తెరపైకి మరో ఎన్టీఆర్ బయోపిక్.. లక్ష్మీ పార్వతిగా లక్ష్మీరాయ్

By Rajababu

తెలుగు ప్రజల ఖ్యాతిని దశదిశలు చాటిన అన్న నందమూరి తారక రామారావు జీవిత కథను తెరకెక్కించడానికి మరో ప్రాజెక్ట్ సిద్ధమైంది. ఇప్పటికే బాలకృష్ణ హీరోగా, దర్శకుడు రాంగోపాల్ వర్మ డైరెక్షన్‌లో రెండు చిత్రాలు తెరకెక్కడానికి సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి 'లక్ష్మీస్ వీరగ్రంథం' అనే పేరుతో ఎన్టీఆర్ బయోపిక్‌పై దృష్టిపెట్టారు. అన్న రామారావుపై ఉన్న ప్రేమ కారణంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.

Recommended Video

ఎన్టీఆర్ మరో బయోపిక్‌పై వర్మ : వీపు హాట్ గా బాగుంది | Oneindia Telugu
 లక్ష్మీస్ వీరగ్రంథం కథ ఇది..

లక్ష్మీస్ వీరగ్రంథం కథ ఇది..

ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన వారి పాత్రలు లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రంలో ఉంటాయి. లక్ష్మీపార్వతి తన భర్త వీరగంధం సుబ్బారావుకు రెండో భార్యగా రావడం. ఆ తర్వాత అతనిని వదిలి సూట్‌కేసుతో బయటకు రావడం లాంటి యదార్థ సంఘటనలు ఉంటాయి. ఇంకా ఎన్టీఆర్ జీవితంలో చోటుచేసుకొన్న ఆసక్తికరమైన సంఘటనలను తెరకెక్కిస్తాం అని జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు.

 వాణి విశ్వనాథ్‌, లక్ష్మీరాయ్‌తో సంప్రదింపులు

వాణి విశ్వనాథ్‌, లక్ష్మీరాయ్‌తో సంప్రదింపులు

లక్ష్మీపార్వతి పాత్రలో నటించాలని ప్రముఖ నటి వాణి విశ్వనాథ్‌ను కోరాం. ఆమెతో సంప్రదింపులు జరుపుతూనే ప్రముఖ తారలు లక్ష్మీరాయ్, పార్వతీ మెల్టన్‌ను కూడా సంప్రందించేందుకు ప్రయత్నిస్తున్నాం అని జగదీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.

 నవంబర్ నుంచి రెగ్యులర్‌గా

నవంబర్ నుంచి రెగ్యులర్‌గా

లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రానికి పేరు ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తారు. ఏ మాత్రం ప్రొడక్షన్ వ్యాల్యూస్ తగ్గకుండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కిస్తాం. ఫొటోగ్రఫీ బాధ్యతలను సుధాకర్‌రెడ్డి నిర్వర్తిస్తారు అని జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. రెండు రోజుల్లో పాటలను రికార్డింగ్ చేయనున్నాం. నవంబర్‌ రెండోవారంలో చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది అని ఆయన చెప్పారు.

 తిరుపతిలో షూటింగ్ ప్రారంభం..

తిరుపతిలో షూటింగ్ ప్రారంభం..

లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రాన్ని తిరుపతిలో ప్రారంభిస్తామని కేతిరెడ్డి చెప్పారు. ఈ చిత్రంలో మూడు పాటలు, ఓ హరికథ ఉంటుందని తెలిపారు. ఈ చిత్రాన్ని 2018 జనవరిలో కచ్చితంగా రిలీజ్ చేయనున్నట్లు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పేర్కొన్నారు.

 అన్నపై ప్రేమతో మళ్లీ డైరెక్షన్‌

అన్నపై ప్రేమతో మళ్లీ డైరెక్షన్‌

అన్న రామారావుగారి మీద అభిమానంతో మళ్లీ 10 ఏళ్ల తర్వాత దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నానని దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. ప్రముఖ దర్శకులు పీసీరెడ్డి, విజయ నిర్మల, కృష్ణ, రాజశేఖర్, రాజేంద్రసింగ్, మోహన్ గాంధీ, జీ రామ్మోహన్‌రావు వద్ద కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పనిచేశారు.

 త్వరలో అమ్మ జనసేన

త్వరలో అమ్మ జనసేన

సినిమాలే కాకుండా తమిళనాడులో తెలుగు ప్రజల ప్రయోజనాలు కాపాడటానికి ఉద్యమాలు చేస్తున్నాను. తమిళనాడు తెలుగు యువశక్తి అనే సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. త్వరలోనే అమ్మ జనసేన పార్టీని స్థాపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X