బాలకృష్ణ సినిమాకి తనే కీలకం అంటోంది
బాలకృష్ణగారి సరసన నటిస్తున్నాను. అందులో ఆయన మూడు పాత్రల్లో నటిస్తున్నారు. ఆ మూడు పాత్రలతో నా పాత్ర కనెక్ట్ అయ్యి సినిమాకి కీలకంగా నిలుస్తుంది అంటోంది లక్ష్మీరాయ్. బాలకృష్ణ,పరుచూరి మురళి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్న ఆమె చాలా హ్యాపీగా తన రీఎంట్రీ చాలా బాగా జరిగిందని చెప్తోంది. ఆ విషయం వివరిస్తూ..కాంచనమాల కేబుల్ టీవీ" తర్వాత తెలుగులో మంచి సినిమాకి అవకాశం వస్తే చేయాలనుకున్నాను. ఈ గ్యాప్‌లో నాకు నచ్చిన పాత్రలు రాలేదు. అందుకని తెలుగులో చేయలేదు. ప్రస్తుతం బాలకృష్ణగారి సరసన చేస్తున్న ఆ సినిమా నా కెరీర్‌కి ప్లస్ అవుతుందనే నమ్మకం ఉంది. ఇక నా పాత్ర నటనకు అవకాశం ఉన్న పాత్ర కూడా. ఇప్పటివరకు చేసిన షూటింగ్‌తో దాదాపు 60 శాతం పూర్తయ్యింది అంది.ఇక లక్ష్మీ రాయ్ నటించిన కాంచన చిత్రం మొన్న శుక్రవారం రిలీజైంది.


Click it and Unblock the Notifications











