సినిమాలకు ఇక స్వస్తి - లయ
చాలామందికి సినిమా ఒక అందమైన కల. చాలా తక్కువ మందికి సినిమా ఒక తీపి జ్ఞాపకం. అలాంటి మధురమైన జ్ఞాపకాలను ఎన్నో సినీనటి లయ జీవితంలో. వాటిని మదిలో పదిలపర్చుకుని ఆమె సినిమాలకు స్వస్తి చెప్పారు. ఇటీవలే వివాహం చేసుకున్న లయ చివరిగా నటించిన చిత్రం టాటా బిర్లా మధ్యలో లైలా.. అక్టోబర్ 21న ఆ చిత్ర నిర్మాణ సంస్థ కార్యాలయంలో లయ చిత్ర యూనిట్ సభ్యులు, విలేఖరుల మధ్య తమ పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు.
పెళ్ళి చేసుకొని సినిమాలకు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాక కాస్త బాధగానే ఉంది. అయితే నా చివరి చిత్రం టాటా బిర్లా మధ్యలో లైలా విజయం సాధించడం ఆనందంగా ఉంది అని ఈ సందర్భంగా లయ అన్నారు. అలాగే సినిమా రంగంలో తాను జరుపుకుంటున్న చివరి పుట్టిన రోజు ఇదేనని చెప్పారు.
భవిష్యత్‌లో తాను మళ్ళీ నటించక పోయినా, తెలుగు సినిమానీ, ప్రేక్షకులనూ మరచిపోలేనని చెప్పారు. తను చేసిన పలు మంచి చిత్రాలే ప్రేక్షకుల మదిలో తనకు సుస్థిర స్థానం కల్పిస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపై సినిమా, టీవీ కంటే నృత్యానికే తాను ప్రాధాన్యమిస్తానని ఆమె అన్నారు.


Click it and Unblock the Notifications