Don't Miss!
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Finance Gold Rate: పిచ్చెక్కిస్తున్న పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరుగుదల.. రూ.4,900 అప్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- News కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులెవరు..!!
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
జూ. ఎన్టీఆర్ సినిమా అందుకే వదులుకున్నా, నేనింకా యంగే.. సీనియర్ హీరోయిన్!
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లయ సినీ ప్రియులందరికీ సుపరిచయమే. హోమ్లీ హీరోయిన్ గా అనేక చిత్రాల్లో నటించిన లయ చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కు అభిమాన నటిగా మారారు. శ్రీకాంత్, బాలయ్య, శివాజీ, వేణు లాంటి హరోలతో లయ అనేక చిత్రాల్లో నటించారు. కానీ వివాహం తర్వాత లయ తన ఫ్యామిలితో అమెరికాలో సెటిల్ అయ్యారు. ప్రస్తుతం ఆమె తల్లిగా, భార్యగా హాయిగా జీవనం సాగిస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లయ సినిమాల్లో తన రీఎంట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తళుక్కున మెరిసింది
నటి లయ 2006లో వివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడింది. ఆ తర్వాత సినిమాల్లో నటించలేదు. మధ్యలో బ్రహ్మలోకం టూ యమలోకం వయా భూలోకం అనే చిత్రంలో ఓ పాత్రలో, గత ఏడాది వచ్చిన రవితేజ చిత్రం అమర్, అక్బర్ ఆంటోని చిత్రంలో తళుక్కున మెరిసిందంతే. పూర్తి స్థాయిలో నటిగా నటించి చాలా కాలం అవుతోంది. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లయ తన టాలీవుడ్ రీ ఎంట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
భర్త నో చెప్పడం లేదు
తాను తిరిగి సినిమాల్లో నటించడానికి తన భర్తకు, కుటుంబానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. కాకపోతే పెళ్లయ్యాక కాస్త విశ్రాంతి తీసుకోవాలని భావించా. ఆ తర్వాత పిల్లలకు తల్లి అయ్యా. దీనితో కాస్త కుటుంబ భాద్యతలు పెరిగాయి. కానీ ఇప్పుడిప్పుడే నటిగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాని లయ తెలిపింది. మంచి అవకాశం వస్తే నటిస్తానని లయ అన్నారు.
అరవింద సమేతలో
గత ఏడాది తనకు జూ. ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని లయ తెలిపింది. కానీ నా వయసుకు మించిన పాత్ర అని ఆ ఛాన్స్ వదులుకున్నా. తల్లి, వదిన లాంటి పాత్రలు చేసే వయసు తనకు ఇంకా రాలేదని చాలా మంది దర్శకులే నాతో అన్నారు. నేనింకా యంగ్ గానే కనిపిస్తున్నానని అన్నారు. అందుకే అలాంటి పాత్రలలో నటించాలంటే కొంత సమయం పడుతుంది అని లయ తెలిపింది.
అనేక రూమర్స్
ఎక్కడో అమెరికాలో జీవనం సాగిస్తున్నా తనపై వస్తున్న రూమర్స్ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయని లయ తెలిపింది. ఆ మధ్యన లయ కారు ప్రమాదానికి గురైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తనకేం కాలేదని అప్పట్లో లయ స్వయంగా అభిమానులకు వివరించాల్సి వచ్చింది. మొత్తంగా టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్న లయకు మంచి అవకాశం ఎప్పుడు దొరుకుతుందో చూడాలి.