For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సోమరిపోతు సల్మాన్

    By Staff
    |

    సల్మాన్ ఖాన్ పేరెత్తితేనే బాలీవుడ్ హీరోయిన్లకు దడ. అతడి గురించి పల్లెత్తు మాట అనాలన్నా వణికిపోతారు. కానీ కత్రినాకైఫ్ మాత్రం సల్మాన్ ఖాన్ ఓ పెద్ద సోమరిపోతు అని నిర్భంయంగా చెపుతోంది. అతడితో తనకున్న పరిచయంలో తను గమనించినది ఇదేనంటోందట. సల్మాన్ ను ఇలా కామెంట్ చేస్తున్నారు. మీకేం భయం వేయడం లేదా? అనడిగితే? ఉన్న విషయాన్నే చెప్పా అతడు తనకు మంచి మిత్రుడు కనుక ఏమైనా అంటానని చెపుతోందట.

    ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఎందుకు బెడిసి కొట్టిందని అడిగితే దాని గురించి సల్మానే చెప్పాలి నేను మాత్రం అతడిని పెద్ద సోమరిపోతు అని అంటానని చెప్పిందట. ఏదేమైనా ఆమె తన ప్రియురాలే కనుక సల్మాన్ ఖాన్ బహుశా కత్రినాను ఏమీ అనకపోవచ్చు. మరొకరైతే తగిన రీతిలో మంచి గుణపాఠం చెప్పి తీరుతాడంటున్నారు బాలీవుడ్ సినీ జనం.

    ఏదేమైనా కత్రినా కత్రినా కత్తిలాంటి డైలాగులను విని సల్మాన్ ఊరుకుంటాడో లేదంటే ఇటీవల ఐష్ తో తనకు గల అనుబంధాన్ని మీడియాలో ఇంటర్యూల ద్వారా ఏకిపారేస్తున్నట్లుగా కత్రినా కైఫ్ ను కూడా గాలికి కట్టేస్తాడో చూడాలి మరి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X